బాత్ రూమ్ లో శిశువు మృతదేహం
నాగర్ కర్నూలు ముచ్చట్లు:
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన చోటు చేసుకున్నది. ప్రసూతి వార్డులోని బాత్రూంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభ్యమైంది. దీంతో మరో సారి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. సోమవారం ప్రసూతి వార్డుకు 18 మంది గర్భిణులు ప్రసవం కోసం వచ్చారు. అందులో ఎనిమిది మందికి వైద్యులు సిజేరియన్ చేశారు. మరో ముగ్గురికి సాధారణ ప్రసవం జరిగింది. బాలింత లకు ఏర్పాటు చేసిన వార్డులోని బాత్రూలలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువు మృతదేహాన్ని వాలాలో కుక్కి యధావిధిగా మూత బిగించారు. బాత్రూం నుంచి మురుగునీరు వెళ్లక పోవడంతో శానిటేషన్ సిబ్బంది వచ్చి గమనించగా శిశువు . మృతదేహం లభ్యమైంది. విషయం ఆస్పత్రి అధి కారులకు తెలపగా వారు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానించారు.

Tags: Baby’s body in the bathroom
