Bachelor's Facial Walk with Jagan

జగన్ తో బూచేపల్లి ఫ్యామలీ పాదయాత్ర

Date:02/03/2018
ఒంగోలు ముచ్చట్లు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 101వ రోజుకు చేరుకుంది.. శుక్రవారం రోజున పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సాగుతోంది.ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో సాగుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తిదాయకమైన పరిణామాలు సంభవించాయి. పాదయాత్ర సందర్భంగా బూచేపల్లి కుటుంబం జగన్ తో పాటు నడవడం ఆసక్తిదాయకంగా మారింది. గత కొన్నాళ్లుగా పార్టీతో కాస్త అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు బూచేపల్లి కుటుంబీకులు. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేశారు. ఓటమిపాలయ్యారు. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చేసారి ఇక్కడ నుంచి మళ్లీ పోటీ చేయడానికి శివప్రసాద్ రెడ్డి సిద్ధంగా లేరనే ప్రచారం సాగుతూ వస్తోంది.అయితే ఆ ఊహాగానాలకు తెరదించుతూ వైసీపీ అధినేతను కలిశారు బూచేపల్లి. కేవలం ఆయన మాత్రమే కాకుండా ఆయన తల్లి బూచేపల్లి వెంకాయమ్మ కూడా జగన్ తో పాటు నడిచారు. ఈ విధంగా నియోజకవర్గంలో పార్టీ బాధ్యులుగా బూచేపల్లి కుటుంబీకులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డే మళ్లీ వైసీపీ తరఫు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది.ఇక ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర నేపథ్యంలో బోయ రంగన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనను అనంతపురం, హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ చార్జిగా ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
Tags: Bachelor’s Facial Walk with Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *