పాలమూరు నేతలకు వెంకన్న టెన్షన్

Date:26/11/2020

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

కవి గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాలమూరు జిల్లాలోని టీఆర్ఎస్ సిట్టింగ్‌లకు టెన్షన్ మొదలైంది. గవర్నర్‌ కోటాలో కవి గోరటి వెంకన్నను ఎమ్మెల్సీని చేయడంతో నాగర్‌కర్నూలు జిల్లా నుంచి ఉన్న శాసనమండలి సభ్యుల సంఖ్య మూడుకు చేరింది. అన్ని వర్గాల్లోకి పార్టీని విస్తరించాలనే వ్యూహంతో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందా.. లేక కాకతాళీయంగానే జరిగిందా అన్న దానిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే టీఆర్ఎస్ సిట్టింగ్ ల్లో మాత్రం గోరటి పదవి పై టెన్షన్ పట్టుకుంది.గోరటికి పదవి ఇవ్వడం ద్వారా కవులకు గుర్తింపు ఇచ్చారని పైకి చెబుతున్నా..

 

 

 

ఈ నియామకం రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి పాలమూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టించేలా ఉంది. ఈ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణ, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరిద్దరి పదవీకాలం మరో ఏడాది ఉంది. కసిరెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందగా.. కూచుకుళ్ల కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ కూచుకుళ్ల టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మొన్నటి ఎన్నికల్లో కల్వకుర్తి టికెట్‌ కోసం ప్రయత్నించారు ఎమ్మెల్సీ కసిరెడ్డి. కానీ జైపాల్ యాదవ్‌కు టికెట్‌ ఇవ్వడంతో.. ఎమ్మెల్సీ పదవీ మళ్లీ తననే వరిస్తుందని కసిరెడ్డి లెక్కలు వేసుకుంటున్నారట.తాజా రాజకీయ పరిణామాల నేపథ్యం , రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాబోతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల్లో రాజకీయ , సామాజిక ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకోని టిఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీలుగా అవకాశాలు ఇవ్వడం స్పష్టం . ఎమ్మెల్యేలుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం ,

 

 

 

ఎమ్మెల్సీ గా ఆ వర్గానికి మైనస్ పాయింట్ గా చెప్పుకొస్తున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఒకరికి , నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఒకరికి ఇవ్వాలనే అభిప్రాయం పార్టిలో వినిపిస్తోందిఅయితే నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని నాగర్ కర్నూలు జిల్లా నుంచి , ఇప్పటికే గవర్నర్ కోటాలో నియమితులైన గోరటి వెంకన్న ప్రాతినిధ్యం వహిస్తుండటం తో ఇక ఆ జిల్లాకు ఎమ్మెల్సీలు దక్కడం కష్టంగా కనిపిస్తోంది . ఇక ఇదిలా ఉంటే మాజి మంత్రి జూపల్లి కృష్ణారావును సైతం అసెంబ్లీ ఎన్నికల లోపే ఏదో ఒక కీలక స్థానం లోకి తీసుకురావాలని అధిష్టానం భావిస్తే జూపల్లి కి ఎమ్మెల్సీ దక్కనుంది. అదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్సీలకు గండం పొంచి ఉన్నట్లే అని విష్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఊహించని మనిషికి పదవి 

Tags: Back tension for Palamuru leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *