భద్రాద్రికి బ్యాక్ వాటర్ టెన్షన్

ఖమ్మం ముచ్చట్లు:

పోలవరం నిర్మాణం పూర్తవుతున్నా కొద్దీ భద్రాచలంతో పాటు పరిసర ప్రాంతాల్లో భయం ఆవరిస్తోంది. పోలవరం ఆనకట్టను కాంటూరు వద్ద 41.15 మీటర్ల ఎత్తులో కడుతున్నారు. 120 కి.మీ మేర దీని ప్రభావం ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. భద్రాచలం నుంచి పోలవరానికి 95 కి.మీ దూరం ఉంటుంది. అంటే దుమ్ముగూడెం వరకు వరద ప్రభావం ఉండనుంది. భద్రాచలం చుట్టూ 7.5 కి.మీ మేర నిర్మించిన కరకట్టలు ఏమేరకు వరదను నిలువరిస్తాయనే విషయంలో ఆందోళన నెలకొంది. గతంలో పలుమార్లు వరదలు వచ్చిన సందర్భంలో రామాలయం పరిసర కాలనీలు నీటమునిగాయి. ఇప్పుడు పోలవరం బ్యాక్‌వాటర్‌ కూడా తోడవడంతో ఏమాత్రం వరద వచ్చినా…ముంపు తప్పదనే ఆందోళన నెలకొంది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బ్యాక్‌ వాటర్‌ ముప్పుపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆంధ్రా- తెలంగాణకు చెందిన ఇంజనీర్ల బృందం గతనెలలో జాయింట్‌ క్రాస్‌ సెక్షనల్‌ సర్వే నిర్వహించింది. పోలవరం నుంచి ఒక ఈఈ, డీఈ, ఏఈ, తెలంగాణ నుంచి ఇద్దరు ఈఈలు, ఒక డీఈ, ఒక ఏఈతో కూడిన టీమ్‌ సర్వే నిర్వహించింది.

 

భద్రాచలం వద్ద కలిసే కిన్నెరసాని, ముర్రేడు ఉపనదుల వరకు ముంపు ప్రభావంపై సర్వే చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మాత్రం కిన్నెరసానిలో 2 కి.మీ వరకు బ్యాక్‌వాటర్‌ ఉంటుంది. 1986 నాటి వరదలు వస్తే కిన్నెరసానిలో 18 కి.మీ, ఉపనది ముర్రేడులో 5.50 కి.మీ మేర బ్యాక్‌వాటర్‌ ప్రభావం ఉండనుంది. ఈ మేరకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ద్వారా ప్రాథమిక నివేదికను ఇంజినీర్ల బృందం అందజేసింది. గతనెల 15వ తేదీనే ఈ నివేదిక ఇచ్చారు. ఇక మోడల్‌ సర్వే మాత్రమే చేయాల్సి ఉంది. ఈ సర్వేలు కూడా భద్రాచలం డివిజన్‌పై బ్యాక్‌ వాటర్‌ ప్రభావం ఉంటుందని చెబుతున్నాయి. భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామనే మాటేగానీ ఆచరణ లేదు. ముంపు విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉన్న నేపథ్యంలోనే భద్రాద్రి అభివృద్ధిని విస్మరిస్తుందా? అనే అనుమానం కూడా ఈ ప్రాంత వాసుల్లో ఉంది.పోలవరం బ్యాక్‌వాటర్‌, ముంపు ప్రమాదాలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పష్టతనివ్వాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. 2019 ఏప్రిల్‌లో సాగునీటి రంగ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్రాంతమంతా పర్యటించి రాష్ట్రప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. పోలవరం కాపర్‌ డ్యాం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో అధికారులు స్పందించి ముప్పు లేకుండా చూడాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్‌ డిమాండ్‌ చేశారు. 2000 సంవత్సరంలో నిర్మించిన కరకట్టను నెల్లిపాక వరకు పొడగించాలని కోరారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Backwater tension for Bhadradri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *