విజయవాడ ముచ్చట్లు:
ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడికి నిత్యం కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే గతంలో క్యూ లైన్లో బాత్రూంలో నుంచి వాటర్ వస్తుందంటూ ఇచ్చిన వార్తకి హడావుడిగా హడావుడిగా వచ్చి అధికారులు ఆ బాత్రూంలే క్లోజ్ చేస్తాం జరిగింది. ఇప్పటికీ 30 రోజులు పైనే అయిన దాని గురించి పట్టించుకుంటాం మరిచిపొయారు. భక్తులు బాత్రూం కి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడం లేదు. దాదాపు 30 రోజులైనా క్యు లైన్లో ఉన్న బాత్రూములు వర్కింగ్ లోకి రాలేదు. దీని గురించి పట్టించుకునే నాధుడే లేడా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులులో ఆడవాళ్లు ,పిల్లలు ,వృద్దులు పడే ఇబ్బందిని పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. బాత్రూంలో వర్క్ చెయ్యకపోవటం మూలన క్లోజ్ చేసిన బాత్రూములకు కట్టిన తాడును తెంపుకొని భక్తులు వెళుతున్నారు. దీన్నిబట్టి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ పొద్దునకి తాడు కడతాం జరుగుతుంది.ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది. భక్తులు బాధని ఎప్పుడుకీ తీరుస్తారో అని ప్రశ్నిస్తున్నారు. మా బాధలు అధికారులు కానీ, ఎవరికి కనపడలేదు వినపడట్లేదు. ఓ అమ్మలగన్నమ్మ మా బాధని నువ్వే పట్టించుకోవాలంటున్న భక్తులు నువ్వే మా బాధలు తీర్చాలంటూ భక్తులు కోరుతున్నారు.
Tags; Bad bathroom problem in Indrakiladri