Natyam ad

జహీరాబాద్‌లో దారుణం

మెదక్ ముచ్చట్లు:

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటన జహీరాబాద్ పట్టణ శివారు డిడిగి గ్రామ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో జరిగింది. కాగా.. అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 24ఏళ్ల వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో జహీరాబాద్ తీసుకువచ్చి.. అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళను సికింద్రాబాద్‌లోని సమీప ప్రాంత వాసిగా గుర్తించారు. ఆటో ఎక్కిన వివాహితకు మత్తుమందు ఇచ్చారా? లేక మద్యం తాగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.సమాచారం ప్రకారం.. శుక్రవారం రాత్రి కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ నుంచి వివాహితను ఆటోలో తీసుకొచ్చి జహీరాబాద్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం స్పృహతప్పి అచేతన స్థితిలో పడి ఉన్న మహిళను స్థానిక వ్యక్తి గుర్తించి జహీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. కొన్నాళ్లుగా ఆమె తన భర్తతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు. సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags: Bad in Zaheerabad

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.