Natyam ad

పుంగనూరులో ఉపాధ్యాయుడుగా స్వాతంత్య్ర సమరంలోకి దిగిన బాడాల

-బాపూజి పిలుపుతో
– తొమ్మిది నెలలు జైల్లో
-ఐదు కొరడ దెబ్బలు
-తొలి ఎమ్మెల్యేగా ఎన్నిక

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

తెల్లదొరల పాలనలో ఉపాధ్యాయుడుగా తన వాక్దాటితో జీవితాన్ని ప్రారంభించి మహాత్మగాంధి పిలుపు మేరకు స్వాతంత్య్ర ఉధ్యమంలోకి దిగి తొమ్మిది నెలలు జైలు శిక్ష అనుభవించి, దిగంబర దేహంపై ఐదు కొరడా దెబ్బలను తిని స్వాతంత్య్ర ఉధ్యమ కారుడిగా నీతినిజాయితీగా ఉన్న బాడాల కృష్ణమూర్తి రావును ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన పుంగనూరు తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. నీతివంతమైన పాలన అందించినందుకు తామ్రపత్ర అవార్డును పొందిన బాడాల చరిత్ర ఇది.

జననం….

పుంగనూరు సమీపంలోని బోడినాయునిపల్లెలో నివాసం ఉన్న బాడాల నాగేశ్వరరావు, నంజమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గరు కుమారైలు . 1920 జూన్‌ 10న బాడాల కృష్ణమూర్తి రావు నాల్గవ సంతానంగా జన్మించారు. స్థానిక బసవరాజ హైస్కూల్‌లో విద్యాబ్యాసం చేశారు. చిన్నతనం నుంచి లలితకళల పట్ల మక్కువ కలిగిన బాడాల పలు నాటక రంగాల్లో తన వాక్దాటితో సబికులను ఆకట్టుకుంటు రాణించారు. సాంమ్రాట్‌చంద్రగుప్త, చాణిక్యపాత్రలను పోషించారు. పాత్రికేయుడుగా ప్రజాస్వామ్యజ్యోతి మాసపత్రికను నిర్వహిస్తూ 1995 జనవరి 2న చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. ఆయన భార్య జయలక్ష్మమ్మ మృతి చెందారు. బాడాలకు ఇద్దరు కుమారైలు పద్మావతి, లీలావతి , వారి కుటుంబ సభ్యులు చిత్తూరు, పుంగనూరులో ఉన్నారు.

ఉధ్యమంలోకి….

తెల్లదొరల పాలనలో హయర్‌గ్రేడ్‌ ఉపాధ్యాయుడుగా రెండేళ్లు మదనపల్లె, పుంగనూరు, సోమలలో పనిచేశారు. ఆ సమయంలో క్విట్‌ఇండియా ఉధ్యమంలో పాల్గొనాలని మహాత్మగాంధి యువతకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉద్యోగానికి రాజీనామ చేసి స్వాతంత్య్ర పోరాటంలోకి బాడాల దిగారు. 1942 సంవత్సరంలో బాడాల కృష్ణమూర్తిరావును మూడు నెలలు జైలులో బందించారు. అదే సంవత్సరంలో టెలిఫోన్‌ తీగలను కత్తరించి, బ్రిటిష్‌ పాలనకు అడ్డుతగిలినందుకు ఆరునెలలు బళ్లారి జైలులో బందించారు. ఈ సమయంలో దిగంబరదేహంపై ఐదు కొరడా దెబ్బలను కొట్టవలసిందిగా బ్రిటిష్‌పాలకులు హుకుం జారీచేయడంతో శిక్షణను అనుభవించి విడుదలైయ్యారు.

ఎమ్మెల్యేగా ఎన్నిక…

స్వాతంత్య్ర సమరయోధుడు , తామ్రపత్ర అవార్డు గ్రహిత బాడాల కృష్ణమూర్తిరావు పుంగనూరు తొలి ఎమ్మెల్యేగా ఎన్నికల్లో గెలుపొందారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటి చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వారనాసి రఘునాథరెడ్డిపై 1299 ఓట్లతో గెలుపొందారు. 1972లో కేంద్ర ప్రభుత్వం తామ్రపత్రం అందజేసింది. 1985 సంవత్సరంలో బాడాలను ఉమ్మడి చిత్తూరు జిల్లా సమరయోధుల సంఘం చిత్తూరులో ఘనంగా సన్మానించారు. కౌటిల్యున్ని అర్థశాన్ని తెలుగులోనికి అనువధించి ఆపుస్తకాని మాజీ ప్రధాని పివి. నరసింహారావుకు అంకితం ఇచ్చారు. బాడాల అనువధించిన అర్థశాస్త్రం గురించి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోదుడు వావిలాల గోపాలకృష్ణయ్య , కట్టమంచి బాలకృష్ణారెడ్డి, ఎంఆర్‌.చంద్ర , పలువురు ప్రశంసలు అందించారు.

 

పెన్షన్‌, పట్టా ఇచ్చారు…

మాతాత బాడాల కృష్ణమూర్తిరావు చనిపోయిన తరువాత మా అవ్వ జయలక్ష్మమ్మకు పెన్షన్‌ కూడ ఇవ్వలేదు. ఇంటి స్థలం కూడ లేకుండ అవస్థలు పడుతున్న విషయాన్ని గమనించిన అప్పటి రాష్ట్ర అటవీశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి పట్టాను, పెన్షను మంజూరు చేయించి, స్వయంగా అందజేశారు. తొలి ఎమ్మెల్యేగా మాతాత చేసిన సేవలకు గుర్తుగా మాకు ప్రభుత్వ పరంగా సహాయం అందించిన మంత్రి పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

– ఎస్‌ఆర్‌.వెంకటప్రసాద్‌, తొలి ఎమ్మెల్యే బాడాల మనవుడు , పుంగనూరు.

 

Tags: Badala joined the freedom struggle as a teacher in Punganur

Post Midle