Natyam ad

జలదిగ్బదంలో బడుగువానిలంక- బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

కోనసీమ ముచ్చట్లు:

చుట్టూ గోదావరి మధ్యలో ద్వీపంలా ఉండే కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామం జలద్రిగ్బదంలో ఉంది.  ఆ గ్రామం చుట్టూ వరదనీరు చేరింది.రాబోయే ప్రమాదాన్ని తలచుకుని ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంట పొలాలన్ని ముంపుకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన గయాలు, ఎస్సి కాలనీ, దుర్గ కాలనీలు శుక్రవారం సాయంత్రానికి ముంపుకు గురయ్యే అవకాశాలున్నాయి. అందుకునే అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. ప్రజలకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.అలాగే పశువులకు కూడా మరో వైద్య శిబిరాన్ని  సంబంధిత శాఖ అధికారులు ఏర్పాటు చేసారు.  విలువైన పాడి పశువులను రైతులు పొలాల నుంచి సురక్ష ప్రాంతాలకు తరలించారు. బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోయి రాకపోకలకు అవకాశం ఉండదు. అందుకునే ముందు జాగ్రత్తగా ఆరు పడవలను సిద్ధం చేసి ఉంచారు.అలాగే ఆ గ్రామంలో గల సుమారు 1600 కుటుంబాల వారికి పదికేజీల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పులను రేషన్ షాపుల ద్వారా అధికారులు పంపిణీ చేసారు. అలాగే 200 బస్తాల వాటర్ ప్యాకట్స్,50 వాటర్ టిన్స్ లను సిద్ధం చేసారు. ఎవరైనా పునరావాస కేంద్రంకు వచ్చేలా ఉంటే చెముడులంక పంచాయతీ కళ్యాణ మండపాన్ని అందుబాటులో ఉంచారు.

 

Tags: Baduguwanilanka in Jaladigbadam – the people who are in trouble

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.