చంద్రబాబునాయుడుతో బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ భేటీ

బద్వేలు ముచ్చట్లు:


తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబునాయుడు  నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లతో సమీక్ష నిర్వాహణలో భాగంగా  బద్వేలు మాజీ శాసనసభ సభ్యురాలు  విజయమ్మతో సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం చేపట్టాల్సిన ప్రణాళిక గురించి దాదాపు గంటన్నర పాటు ఏకాంత సమావేశం జరిగింది. బద్వేలు లో తెలుగుదేశంపార్టీ గెలుపు పై విధివిధానాలు గురించి చంద్రబాబునాయుడు  సలహాలు,సూచనలు ఇచ్చారు.
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు ఇప్పటి నుండి చేపట్టవలసిన ప్రణాళిక గురించి విజయమ్మ కు చంద్రబాబు వివరించారు.పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని, బాదుడే బాదుధుడు కార్యక్రమంను కొనసాగించడం వల్ల ప్రజలకుమరింత దగ్గర అవుతామని అయన సూచించారు. ఎన్నికల్లో క్లస్టర్,యూనిట్లు, బూత్ ఏజెంట్లు కీలకమని ప్రణాళికతో ముందుకు వెళ్లితే విజయం సులభతరమవుతుందని చంద్రబాబునాయుడు వివరించారు.
నియోజవర్గ లో పార్టీకి  వ్యతిరేకంగా  పనిచేస్తే ఇంతటి వారిపైన చర్యలు  తప్పనిసరిగా తీసుకుంటామని చంద్రబాబు నాయుడు  సూచించారు . సమావేశంలో  నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజశేఖర్, బద్వేల్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగల రెడ్డి, రితేష్ రెడ్డి  మరికొందరు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 

Tags: Badvelu former MLA Vijayamma met with Chandrababu Naidu

Leave A Reply

Your email address will not be published.