భక్తులతో కిటకిటలాడిన బద్వేలు శివాలయాలు
బద్వేలు ముచ్చట్లు:
కార్తిక మాసం సందర్భంగా రెండవ సోమవారం బద్వేల్ లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ముఖ్యంగా రూప రామ్ పేట శివాలయం భక్తులతో తెల్లవారుజాము నుండే రాకపోకలు మొదలయ్యాయి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఆలయానికి భక్తుల రాక సందర్భంగా దేవాదాయ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు ప్రముఖులు శివాలయాన్ని దర్శించుకున్నారు ఎంతో భక్తితో శివపార్వతులకు పూజలు చేశారు పురాతన ఆలయం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది రూపా రామ్ పేట శివాలయానికి బద్వేల్ లోనే ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది కాగా గోపవరం తాసిల్దార్ దామోదర్ రెడ్డి శివాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ నిర్వాహకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు కాగా వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో కొండమీద ఈ శివాలయం ఉంది.
Tags: Badvelu Shiva temples crowded with devotees

