Natyam ad

బద్వేలు తెలుగుదేశం పార్టీలో మితిమీరిన ఆత్మ విశ్వాసం

అభ్యర్థి కొంప ముంచబోతున్నాయా ?

గ్రూపులుగా విడిపోయిన పార్టీ నాయకులు కార్యకర్తలు

రిజర్వు అయిన తరువాత తెలుగుదేశం పార్టీకి వరుస ఓటములు

Post Midle

ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులను మార్పు చేయడం కూడా మరో కారణం

తెలుగుదేశం పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులు

అంచనా వేస్తున్న రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు

ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే విజయవాడ పార్టీ కార్యాలయానికి రావద్దన్న నారా లోకేష్

బద్వేలు ముచ్చట్లు:

 

బద్వేలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీలో మితిమీరిన ఆత్మవిశ్వాసం నెలకొంది. నారా లోకేష్ పాదయాత్ర ముగిసిన తర్వాత మితిమీరిన విశ్వాసం మరింత పెరిగిపోయింది. ఈ మితిమీరిన విశ్వాసం పార్టీ అభ్యర్థిని కొంప ముంచబోతున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు గత కొద్ది రోజులుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రతి మండలంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. పార్టీ ముఖ్య నాయకులు ఈ విషయాన్ని అంగీకరించకపోయినా క్షేత్ర స్థాయిలో ఇదే జరుగుతుంది. మరో నాలుగు మాసాలలో ఎన్నికలు ఉండడంతో పార్టీలోని కీలకమైన వ్యక్తులు గ్రూపులుగా విడిపోయి పార్టీ అభ్యర్థికి చేటు చేయబోతున్నారు. గడచిన నాలుగు ఎన్నికల్లోను ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో వైకాపా బలంగా ఉంది. ఇది ఎవరు కాదనలేని సత్యం వైకాపాను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ కీలక నేతలు సర్వ శక్తులు పనంగా పెట్టవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు అసంతృప్తి ఉన్నప్పటికీ బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దానిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. ఈ విషయాన్ని కూడా పరిశీలకులు మరి మరి చెబుతున్నారు. పార్టీ కీలక నేతలు అప్పుడప్పుడు చుట్టూచూపుగా బద్వేల్ కు రావడం వారు భజన బృందాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా మైనస్ గా మారింది. ఈతతంగం ఎప్పటినుంచో ఉంది. బద్వేలు నియోజకవర్గ ఓటర్లలో తెలుగుదేశం పై ఎక్కలేని ప్రేమ సానుభూతి ఉంది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పార్టీ నాయకులు ప్రతిసారి విఫలమవుతున్నారు. ఇది కూడా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. తెలుగుదేశం పార్టీలో తాము కీలక నేతలమని చెప్పుకునేవా నాయకులు కేవలం ఒక చోటికి పరిమితం కావడం ప్రజలను ఏమాత్రం పట్టించుకోకపోవడం మైనస్ గా మారింది. ఇదే విషయాన్ని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు మరి మరి చెబుతున్నారు. ప్రతి మండలంలో దాదాపు ఇదే పరిస్థితి. కీలక నేతలు వచ్చినప్పుడు వారితో కలిసి ఫోటోలు తీసుకోవడం ఆ ఫోటోలు ప్రచారానికి ఉపయోగించడం తప్ప ప్రజలతో వారికి ఉన్న సంబంధాలు ఏమిటి అని అడిగేవారు లేకుండా పోయారు. మండల స్థాయి నాయకులమని చెప్పుకోవడం తప్ప ప్రజలతో వారికి పెద్దగా సంబంధాలు లేవని రాజకీయ పరిశీలకులు మరి మరి చెబుతున్నారు.

 

 

కేవలం ప్రచారం కోసమే కొందరు మండల నాయకులు పరిమితమయ్యారు ఈ విషయాన్ని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బద్వేలు తెలుగుదేశం పార్టీలో ఒక కోటరీ ఉంది. ఇది కూడా అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. ఈ కోటరిలో ఉన్నవారికి కనీసం పది ఓట్లు కూడా లేవు కానీ పెత్తనం చేస్తూ ఉంటారు. చాలా కాలంగా ఇదే తంతు. కోటరీ బారి నుండి తెలుగుదేశం పార్టీ కీలక నేతలు బయట పడలేక పోతున్నారు. ఇది కూడా పెద్ద మైనస్ గా మారింది. అసలు విషయానికి వస్తే బద్వేలు అసెంబ్లీ రిజర్వ్ అయిన తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది. జరగబోయేది ఐదో ఎన్నిక జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని నాయకులు పదేపదే చెబుతున్నారు. వారిలో మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉందని అవిశ్వాసమే కొంప ముంచబోతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిజర్వు అయిన తర్వాత ప్రతి ఎన్నికల్లోను ప్రజలతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం హోరాహోరీ పోరులో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడం తెలిసిందే.  జరిగే ఎన్నికల్లోను నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్న పోరుమామిళ్ల వాసి బొజ్జ రోశయ్యకు అభ్యర్థిగా నిర్ణయించారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. బద్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించకపోతే విజయవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కి రావద్దని నారా లోకేష్ బద్వేల్ లో జరిగిన పాదయాత్రలో మరి మరి చెప్పడం జరిగింది. ఇది కూడా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక విధమైన గుబులు రేపు తుంది. తెలుగుదేశం అభ్యర్థి బొజ్జ రోశయ్యకు ప్రజలతో పెద్దగా సంబంధాలు లేవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి నిర్ణయించారు. గనుక ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రజలు ఆయనను ఎంతవరకు ఆశీర్వదిస్తారు,
పార్టీలోని చీడ పురుగులు కోటరీ ఆయన విజయానికి దోహద పడతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

 

Tags: Badwelu is overconfident in the Telugu Desam Party

Post Midle