Natyam ad

బద్వేలు పోరుమామిళ్ల  అటవీ శాఖలో ఇంటి దొంగలు

అటవీ సంపదను దోచుకుంటున్న ఒక అధికారి
అక్రమంగా ఎర్రచందనం తరలింపు
అటవీ సంపద తరలింపులో బీట్ అధికారులే కీలకం

బద్వేలు ముచ్చట్లు:

 

Post Midle

బద్వేలు పోరుమామిళ్ల  అటవీ శాఖలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు అటవీ సంపదను దోచుకుంటున్న ఒక అధికారిని ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు
బద్వేలు పోరుమామిళ్ల అటవీశాఖ పరిధిలోని అడవుల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఎర్రచందనం తరలించే విషయంలో కొందరు బీట్ అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారు ఇది కూడా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే రెండు ఫారెస్ట్ రేంజ్ లో పరిధిలో లెక్కకు మించి ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు కానీ అధికారుల లెక్కల్లో కేవలం కొద్ది మంది మాత్రమే ఈ పని చేస్తున్నట్లు చెబుతున్నారు బద్వేల్ కేంద్రంగా తల పండిన ఎర్రచందనం స్మగ్లర్లు ఇప్పటికీ లేకపోలేదు పైకి పెద్దమనుషుల చలామణి అవుతున్న వారు ఇప్పటికి కూడా అదే వృత్తిలో ఉన్నారు అటవీ సంపదను దోచుకుంటూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు ఇది కూడా అందరికీ తెలిసింది అడవుల్లోని కలప ఎంతో విలువైన అటవీ సంపదను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు గత నెల రోజులుగా ఈ దోపిడి మరింత ఎక్కువైంది పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బీట్ అధికారి దస్తగిరి రెడ్డి అక్రమంగా కలప తరలిస్తూ టాస్క్ ఫోర్స్ అధికారులకు పట్టుబడ్డారు ఇలాంటి కోవలోకి మరి ఎంతోమంది బీట్ అధికారులు ఉన్నారు ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులే ప్రైవేట్ సంభాషణలో చెబుతున్నారు అడవుల్లో చెట్లను నరికించి వాటిని బొగ్గుగా మార్చి ట్రాక్టర్ కు 3000 రూపాయల ప్రకారం వసూలు చేస్తున్నారు ఇది కూడా అందరికీ తెలిసిందే
అడవుల్లో ఒకపక్క ప్లాంటేషన్ జరుగుతుంటే మరోపక్క ఎంతో విలువైన చెట్లను నరికించి బొగ్గుగా మార్చడం ఆందోళన కలిగించే విషయం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అటవీ శాఖ అధికారులే పదేపదే చెబుతుంటారు కానీ చేతలకు మాటలకు పొంతనే లేకుండా పోయింది కొద్దిరోజుల
క్రితం పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజి పరిధిలో అక్రమంగా తరలిస్తున్న కలపను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులే చెబుతున్నారు ఉన్నతాధికారుల కళ్ళు కప్పి ఎంత అటవీ సంపదను దోచుకున్నారు అనే విషయం లెక్క తెలవలసి ఉంది.

 

Tags: Badwelu Porumamilla  house robbers in forest department

Post Midle