త్వరలో బద్వేలు తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ రెడ్డి పాదయాత్ర

పాదయాత్ర విజయవంతానికి సన్నద్ధమవుతున్న పార్టీ నాయకులు కార్యకర్తలు
బద్వేల్లో తెలుగుదేశం విజయమే లక్ష్యంగా రితేష్ రెడ్డి పాదయాత్ర

బద్వేల్ ముచ్చట్లు:

 

తెలుగుదేశం పార్టీ యువనేతమాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు
రితేష్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో త్వరలో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో అన్ని తానై
పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తున్నారు బద్వేల్ నియోజకవర్గం రిజర్వు అయిన తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది.  జరగబోయే ఎన్నికల్లో ప్రజల అభిమానం ఓటర్ల ఆశీస్సులతో ఎన్నికల్లో గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ఎంతో ధీమాగా ఉంది
. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అట్లూరు గోపవరం మండలాలతోపాటు బద్వేలు పట్టణంలోమూడు రోజులపాటు పాదయాత్ర చేశారు.  ఎవరు నువ్వు ఊహించని స్థాయిలో ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద స్థాయిలో హాజరయ్యారు.  లోకేష్ తో కలిసి చేయి చేయి చెయ్యి కలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు.  ముఖ్యంగా బద్వేల్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో వేలాదిమంది ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.  ప్రతిపక్షాలు అసూయ పడేలా నారా లోకేష్ పాదయాత్ర సాగింది నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకొని బద్వేలు పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్ర శ్రీకారం చేయబోతున్నారు.

 

 

 

రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్ర నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామ గ్రామాన జరగబోతుంది. ఇందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర విజయవంతం చేసేందుకు ఇప్పటినుంచి కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు.  రితేష్ కుమార్ రెడ్డి చేసే పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి మరింత ప్రజాబలం చేకూరుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు భావిస్తున్నారు. నారా లోకేష్ బద్వేల్ నియోజకవర్గం లో చేసిన పాదయాత్రతో తెలుగుదేశం పార్టీలో మంచి జోష్ వచ్చింది.  అజోష్ కొనసాగింపుగా రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నట్లు సమాచారం.  ఈ విషయాన్ని కొందరు పార్టీ నాయకులు తెలిపారు.  పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు వారు చెప్పారు.  బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం నా బాధ్యతని నారా లోకేష్ తన పాదయాత్రలో ప్రజల సమక్షంలో చెప్పారు.  బద్వేలు నియోజవర్గం తనకు తల్లి లాంటిది అని ఇక్కడ అభివృద్ధికి తానే బాధ్యత వహిస్తానని నారా లోకేష్ పదే పదే చెప్పారు.  వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఇందుకు బద్వేలు నియోజకవర్గంలో పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆయన మరి మరి కోరారు.  నారా లోకేష్ చేసిన వాగ్దానాలు అభివృద్ధి బాధ్యత తనదేనని చెప్పడంతో ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆసక్తి కనపరుస్తున్నారు.

 

 

ఈ నేపథ్యంలో రితేష్ కుమార్ రెడ్డి జరిపే పాదయాత్ర లో ప్రజల్ని నేరుగా కలుసుకోవడం వారి ఇబ్బందులు తెలుసుకోవడం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం జరుగుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బద్వేల్ నియోజకవర్గం లో వైకాపా నాయకులు కార్యకర్తలు జరిపిన ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రజలకు ఆయన మరోసారి వివరించ బోతున్నారు.  బద్వేల్ పట్టణంలో ఒక వితంతు మహిళ ఇంటిని వైకాపా నాయకులు కార్యకర్తలు పట్టపగలు  విషయాన్ని ఆయన ఈ పాదయాత్రలో ప్రజలకు చెప్పబోతున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి గురించి వివరించ బోతున్నారు.

 

 

బద్వేలు నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ దేనని ఆయన ప్రజలకు చెప్పబోతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీ రామారావు తెలుగు గంగ రిజర్వాయర్కు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన ప్రజలకు గుర్తుచేబోతున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులపై చెప్పబోతున్నారు వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను దితేష్ కుమార్ రెడ్డి మరి మరి తన పాదయాత్రలో మరి మరి కోరనున్నట్లు సమాచారం. బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు స్థానిక రాజకీయ నేతలు ఎవరు పాదయాత్ర చేయలేదు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్రతో ప్రత్యర్థి పార్టీలో భయం మొదలవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు.

 

Tags: Badwelu Telugu Desam Party Youth Leader Ritesh Reddy Padayatra soon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *