బాహుబలి రికార్డ్ లను చెరిపేసిన 2.0

Bahubali records broken down 2.0

Bahubali records broken down 2.0

Date:23/11/2018
చెన్నై ముచ్చట్లు:
బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ సినిమా తరవాత అన్నీ నాన్-బాహుబలి రికార్డులే అయిపోయాయి. ‘బాహుబలి’ తరవాత ఎన్ని చిత్రాలు వచ్చినా అవి రికార్డుల విషయంలో రాజమౌళి సినిమా దరిదాపుల్లోకి వెళ్లలేదు. కానీ ఇప్పుడు ‘బాహుబలి 2’కు రజినీకాంత్ ‘2.0’ చెక్ పెడుతోంది. విడుదలకు ముందే రికార్డుల రేసును మొదలుపెడుతోంది. రజినీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో శంకర్ తెరకెక్కించిన ‘2.0’పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ‘రోబో’కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ భారీ యాక్షన్ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. రూ.543 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ‘2.0’ విడుదలకు ముందే ‘బాహుబలి 2’ రికార్డులను చెరపడం మొదలుపెట్టింది. ‘బాహుబలి 2’ సినిమా దేశ వ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదలైంది. అయితే ఇప్పుడు ‘2.0’ సినిమా 6600 నుంచి 6800 థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్లలో ‘2.0’ ప్రదర్శితమవనుంది.
‘బాహుబలి 2’ ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో విడుదలైంది. దాదాపు 11 భాషల్లోకి అనువాదమైన ‘2.0’ ఉత్తర భారతంలో 4000 నుంచి 4100 థియేటర్లలో విడుదలవుతుండటం గమనార్హం. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అయితే 1200 నుంచి 1250 థియేటర్లలో ‘2.0’ విడుదలవుతోంది. తమిళనాడులో 625 థియేటర్లలో రిలీజ్ అవుతోన్న ‘2.0’.. కర్ణాటకలో 300 థియేటర్లలో ప్రదర్శితమవనుంది. దేశ వ్యాప్తంగా 17 ఐమ్యాక్స్, ఐమ్యాక్స్ 3డి థియేటర్లలోనూ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం విడుదల కానుంది. సెన్సార్ బోర్డు నుంచి ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందిన ‘2.0’ రన్ టైమ్ కూడా 2 గంటల 28 నిమిషాలు మాత్రమే. ఇదిలా ఉంటే, ‘2.0’ విడుదలకు ముందే దాదాపు రూ.120 కోట్ల బిజినెస్ చేసేసింది. తమిళ సినీ పరిశ్రమలో విడుదలకు ముందే రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా ‘2.0’ రికార్డుకెక్కింది. 3డి టెక్నాలజీ, 4డి సౌండ్ ఎఫెక్ట్‌తో వస్తోన్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు.
Tags:Bahubali records broken down 2.0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *