బహుజనుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ ఘనంగా 38వ వర్ధంతి JAC సాకే హరి

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

 

బహుజనుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రావ్ ఆశయాలను ఎప్పటికీ మర్చిపోలేమని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు.శనివారం సప్తగిరి సర్కిల్ లోని బాబు జగ్జీవన్ రావ్ 38వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జెఏసి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం, పేద ప్రజలకు సంక్షేమ అభివృద్ధిని సాధించి పెట్టిన బాబు జగ్జీవన్ రావ్ ను భారతదేశ పౌరులు ఎప్పటికీ మర్చిపోలేరని కొనియాడారు. చిన్నతనము నుండే ప్రజలకు సేవలందిస్తూ దేశ ఉప ప్రధానిగా న్యాయ పండితుడుగా రాజకీయ కోవిదుడుగా అనేక ఉన్నత స్థానాలను అధిరోహించిన గొప్ప మహనీయులని చాటి చెప్పారు.తుది శ్వాస వరకు పేద ప్రజల కోసం పనిచేసిన బాబు జగ్జీవన్ రావ్ ఆలోచన విధానాలను యువత ముందుకు తీసుకుపోవడానికి ముందుకు రావాలని కోరారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు దాసరి రామాంజనేయులు.సుంకన్న.వ న్నూరప్ప. నారాయణస్వామి.నాగరాజు.ఓబులేసు. ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags:Bahujanula Asha Jyoti Babu Jagjeevan Celebrates 38th Death Anniversary of JAC Sake Hari

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *