బక్రీద్ పండుగ త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీక.

– ఈ పర్వదినాన్ని సుఖ శాంతులతో జరుపుకోండి.

-చిత్తూరు ఎస్పీ  వి.ఎన్. మణికంఠ చందోలు, ఐ.పి.ఎస్

 

చిత్తూరు ముచ్చట్లు:


బక్రీద్ పండుగ సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు సుఖ శాంతులతో ఈ పర్వదినాన్ని జరుపుకోనేటట్లు చిత్తూరు ఎస్పీ  ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమైనది. ప్రత్యేకంగా గత కొన్ని రోజులుగా ముందస్తు భద్రత చర్యలలో భాగంగా మసీదుల వద్ద, ముస్లిం ప్రజలు నివసిస్తున్న ప్రదేశాల నందు మత పెద్దలతో పోలీసు అధికారులు సమావేశాలు జరుపుతూ బక్రీద్ పండుగ సందర్బముగా ఎలాంటి సమస్యలు రాకుండా ప్రార్ధన సమయములో మరియు ఇతర కార్యక్రమాలు జరుపునప్పుడు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచిస్తూ విజ్ఞప్తి చేశారు.కావున ప్రజలు క్రింద కనబరిచిన విషయాలను గుర్తుంచుకొని జిల్లా నందు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించవలసినదిగా విన్నపము.

 అమలులో ఉన్న Cow Protection Act 2017 చట్టం ప్రకారము గోవులను వధించడం చట్టరీత్య నేరం.
 గోవులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశం కు తరలిస్తున్న సందర్భాలలో తగిన పత్రాలను వుంచుకొనవలెను.
 శాంతి భద్రతల సమస్యలు, మత సంఘర్షణలు ఉత్పన్నం అయ్యే విధంగా ఎవ్వరు ప్రవర్తించకూడదు, “ప్రేరేపించకూడదు”. అలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోనబడును.
 సోషల్ మీడియా నందు మతసంఘర్షణలు తలెత్తే పోస్టులు పెట్టకండి.
 పుకార్లను నమ్మవద్దు, అపోహలు, వదంతులను నమ్మి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయరాదు.
 ఎక్కడైనా ఏదైనా అసాంఘిక, అనైతిక కార్యక్రమాలు జరుగుతుంటే డయల్ 112 లేదా లోకల్ పోలీస్ వాట్సప్ నెంబర్ 9440900005 కి తెలియజేయండి.ప్రజాశాంతి పెంపొందించటంలో పోలీసు వారికి సహకరించండి.చిత్తూరు పోలీసు వారి తరుపున ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు.

 

Tags:Bakrid festival symbolizes sacrifice and religious harmony.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *