Bakried Celebrations on 22nd

Bakried Celebrations on 22nd

Date:19/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

ముస్లింల పండుగల్లో బక్రీద్ పండుగ ఒకటి అన్ని మురాదియా దర్గా పిఠాథిపతి సయ్యద్ షా మహ్మద్ జమాలూల్లా సాహెబ్ అన్నారు .

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగకు ఈదుల్ అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు.

 

ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను ( ఒంటె , మేక, గొర్రె , ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు.

 

ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారని తెలిపారు.

కేరళ వరద బాధితుల కోసం ఆర్థిక సహాయం అందించండి

Tags: Bakried Celebrations on 22nd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *