బాలా త్రిపురసుందరిగా దుర్గమ్మ

Bala Tripura is Durgamma

Bala Tripura is Durgamma

Date:11/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
దసర ఉత్సవాలలో రెండవ రోజు అయిన  గురువారం అమ్మవారు బాలత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్మనం ఇచ్చారు. ఈ అలంకారంలో అమ్మవారిని భక్తులు ఏమాత్రం సేవను నిర్వహించిన పరిపూర్ణమైన ఫలం ప్రసాదిస్తుంది. ఈ అలంకారంలో అమ్మవారు సుమారు మూడు ఏండ్ల ప్రాయంలో ఉన్న బాలికా స్వరూపంలో దర్శనం ఇస్తారు.  చిన్న పిల్లలు ఎలాఅయితే స్వల్ప లబ్దిపొంది పరశించి పోతారో ఆదే విధంగా బాలత్రిపుర సుందరి దేవి  అలంకారంలో ఉన్న అమ్మవారు భక్తులు చేసే స్వల్పసేవకే అనంత ఫలం కలుగజెస్తుంది.  అదే విధంగా విశేష సేవ చేసిన వారిని ఎల్లవేళల వెంట ఉండి కాపాడుతుందని భక్తుల విశ్వాసం.
ఈ అలంకారంలో అమ్మవారు చతుర్బుజాలలో పుస్తకము, జపమాల, వర అభయములు ధరించి బాలసూర్యుని కాంతులతో ప్రకాశిస్తూ దిక్కులను ప్రకాశింపచేస్తూ భక్తులకు దర్శనమిచ్చే శుభస్వరూపం. అమ్మవారి దర్శనం వలన విద్యా వృద్ధి, జ్ఞాన వృద్ది, తపఃసిద్ధి మొదలైన ఆధ్యాత్మిక విజయములు , లౌకిక సర్వకార్యముల యందు విజయము పొంది సర్వాభివృద్ధిని ప్రసాదించే లౌకిక విజయాన్ని అనుగ్రహిస్తుందని లోక ప్రతితీ. త్రిలోకాలను కాపాడే సర్వశక్తి సంపన్నురాలు బాలత్రిపుర సుందరీ దేవి అని శాస్త్రాలలో చెప్పబడింది.
Tags:Bala Tripura is Durgamma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *