భక్తిభావాన్ని పంచిన బాలకాండ అఖండ పారాయణం
తిరుమల ముచ్చట్లు:
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు పదో విడత బాలకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా సాగింది.ఇందులో 45 నుండి 49 సర్గల వరకు గల 133 శ్లోకాలను పారాయణం చేశారు. అహల్యకృత శ్రీరామ స్తోత్రం 23 శ్లోకాలు, యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి, ధర్మగిరి వేద పాఠశాల పండితులు కె.రామానుజాచార్యులు, పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకురాలు డా.కె.వందన బృందం కార్యక్రమం మొదట్లో త్యాగరాజ కీర్తన “ఎందరో మహానుభావులు….”, చివరలో “శ్రీ హనుమాన్ జయ హనుమాన్…” కీర్తనలు చక్కగా ఆలపించారు.ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: Balakanda Akhanda Parayanam which spread devotion
