Date:18/01/2021
సికింద్రాబాద్ ముచ్చట్లు:
బేగంపేట్ రసూల్ పుర చౌరస్థలోని ఎన్ టీ ఆర్ విగ్రహానికి పూలదండ వేసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. తరువాత బాలకృష్ణ అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఒక మనిషి శక్తిగా మారి వ్యవస్థను సమూలంగా మార్చిన మహా నేత ఎన్టీఆర్. సత్సకల్పం ఉంటే సాధించలేనిది ఏమి లేదని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్. అనితర సాధ్యం కానీ ఎన్నో పాత్రలు ధరించి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి స్వయం పాలనకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత. ఎన్టీఆర్ రాష్ట్రానికే కాకుండా దేశానికి చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తి దాయకమని అన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo
Tags: Balakrishna inaugurates Amarajyoti rally