Natyam ad

బాలకృష్ణ విశ్వరూపం, వీర విహారం

హైదరాబాద్  ముచ్చట్లు :

 


ఫ్యాక్షన్ నేపథ్యంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ  బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. టైటిల్‌లో ‘సింహా’ పేరున్న ఆయన మెజారిటీ సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ సాధించాయి. ఈ సంక్రాంతి వస్తున్న ఆయన సినిమా ‘వీర సింహా రెడ్డి. టైటిల్‌లో ‘సింహా’ సెంటిమెంట్, విజయాలు ఇచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యం… ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ  : జై సింహా రెడ్డి (నందమూరి బాలకృష్ణ), అతని తల్లి మీనాక్షి (హనీ రోజ్) ఇస్తాంబుల్‌లో ఉంటారు. జై, ఈషా (శ్రుతీ హాసన్) ప్రేమలో పడతారు. వాళ్ళ పెళ్ళికి ఈషా తండ్రి (మురళీ శర్మ) గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. జై తల్లిదండ్రులను ఇంటికి రమ్మని చెబుతాడు… పెళ్ళి సంబంధం మాట్లాడటానికి! అప్పటి వరకు తన తండ్రి లేడని అనుకున్న జైకు అసలు నిజం తెలుస్తుంది. రాయలసీమను తన కనుసైగలతో శాసించే నాయకుడు వీర సింహా రెడ్డి (నందమూరి బాలకృష్ణ)కి, తనకు జన్మించావని జైతో తల్లి చెబుతుంది. కొడుకు పెళ్ళి కోసం వీర సింహా రెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. అక్కడికి సీమలోని ప్రత్యర్థి ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్), భాను (వరలక్ష్మీ శరత్ కుమార్) వస్తారు. ఎటాక్ చేస్తారు. అన్నయ్య వీర సింహా రెడ్డిని చంపాలని చెల్లలు భాను ఎందుకు పగ పట్టింది? ప్రతాప్ రెడ్డి పగకు కారణం ఏంటి?

 

 

 

 

అసలు… 30 ఏళ్ళు వీర సింహా రెడ్డి, మీనాక్షి ఎందుకు విడిగా ఉన్నారు? ఎటాక్ చేసిన వాళ్ళను వీర సింహా రెడ్డి ఏం చేశాడు? తండ్రి గురించి తెలిసిన తర్వాత జై సింహా రెడ్డి ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.విశ్లేషణ : ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలకృష్ణ గతంలో చేసిన సినిమాలకు, ‘వీర సింహా రెడ్డి’కి డిఫరెన్స్ ఏంటి? అంటే… వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్ కనబడుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ గుర్తుకు వస్తుంది. టైటిల్ పాత్రలో బాలకృష్ణ విశ్వరూపం కళ్ళ ముందు మెదులుతుంది.ఒక్క ముక్కలో చెప్పాలంటే… ‘వీర సింహా రెడ్డి’ కమర్షియల్ కొలతలతో, ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాల ప్రభావంతో రూపొందిన సినిమా. బాలకృష్ణ ఫైట్స్ చేశారు. ఆయన ఇమేజ్‌కు తగ్గట్టు రామ్ లక్ష్మణ్ బాగా డిజైన్ చేశారు. హుషారుగా డ్యాన్సులు చేశారు. పాత్రలో జీవించారు. బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ & ఫైట్స్ మీద పెట్టిన దృష్టి, సినిమాపై దర్శకుడు పెట్టలేదు. వీర సింహా రెడ్డి క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి… మిగతా సన్నివేశాలను సరిగా రాసుకోలేదు. బాలకృష్ణ, శ్రుతీ హాసన్ మధ్య సన్నివేశాలు బాలేదు. రెండు మూడు అయినప్పటికీ కొత్తగా రాస్తే బావుండేది. ఇంటర్వెల్ తర్వాత నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి క్యారెక్టర్ ఇంతకు ముందు ఏదో సినిమాలో చూసినట్టు ఉంటుంది.

 

 

 

Post Midle

సాకేంతిక విషయాలకు వస్తే… మాటలు, పాటలు, నేపథ్య సంగీతం, యాక్షన్ బాగున్నాయి. సాయి మాధవ్ బుర్రా ప్రతి మాటలో బాలకృష్ణ మీద భక్తి బలంగా కనిపించింది. వీర సింహా రెడ్డిది లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ కావడంతో హీరోయిజం ఎలివేట్ చేసే డైలాగ్స్ పడ్డాయి. ఏపీలోని ప్రభుత్వానికి సూటిగా తగిలేలా రెండు మూడు చోట్ల సెటైర్లు కూడా ఉన్నాయి. హీరోకి మాటల రచయిత, దర్శకుడు అభిమానులు అయితే ఎటువంటి డైలాగ్స్ ఉంటాయనేది చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణ.కమర్షియల్ సినిమాలకు ఎటువంటి సాంగ్స్ కావాలో… అటువంటి సాంగ్స్ చేశారు తమన్. నేపథ్య సంగీతంతో పూనకాలు తెప్పించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పీక్స్‌లో ఉంది. తమన్ ఆర్ఆర్ ఊపు తెప్పించే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఇస్తాంబుల్ ఫైట్ సీజీ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి.నటీనటులు ఎలా చేశారంటే? : బాలకృష్ణ & ఫ్యాక్షన్ లీడర్ క్యారెక్టర్ ఎవర్‌గ్రీన్‌ సూపర్‌హిట్‌ కాంబినేషన్. మరోసారి ఫ్యాక్షన్ లీడర్‌గా వీర విహారం చేశారు. విశ్వ రూపం చూపించారు. స్క్రీన్ మీద వీర సింహా రెడ్డి కనిపించిన ప్రతి సన్నివేశం నందమూరి అభిమానులకు హై ఇస్తుంది. బాలకృష్ణ స్క్రీన్ మీద కనబడిన సన్నివేశాల్లో మరొక ఆర్టిస్ట్ మీద చూపు పడదు. వరలక్ష్మీ శరత్ కుమార్ చక్కని విలనిజం చూపించారు. అలాగే… బాలకృష్ణకు, ఆమెకు మధ్య సన్నివేశాల్లో ఎమోషన్ బావుంది.

 

 

 

కానీ, డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. ఇంతకు మించి చెబితే ట్విస్ట్ రివీల్ అవుతుంది. శ్రుతీ హాసన్‌ది రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్. రెండు పాటలు, మూడు నాలుగు సన్నివేశాలకు పరిమితం అయ్యారు. బాలకృష్ణతో హుషారుగా స్టెప్పులు వేశారు. కార్ తుడిచే సన్నివేశం మాస్ ఆడియన్స్‌ను మెప్పించవచ్చు. కానీ, అందులో ఆమెను చూపించిన తీరు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కు నచ్చకపోవచ్చు. ఇంటర్వెల్ ముందు వరకు హానీ రోజ్ తల్లి పాత్రలో కనపడతారు. ఆ తర్వాత వీర  సింహా రెడ్డి మరదలుగా ఓ సన్నివేశంలో గ్లామర్ ఒలకబోశారు. పాటలో స్టెప్పులు వేశారు. దునియా విజయ్ నటన అరుపులకు, పగతో రగిలే చూపుకు పరిమితం అయ్యింది. లాల్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, మురళీ శర్మ, అజయ్ ఘోష్ తదితరులవి రెగ్యులర్ రోల్స్. బ్రహ్మానందం, ఆలీ ఓ సన్నివేశంలో సందడి చేశారు. ‘మా బావ మనోభావాలు…’ పాటలో చంద్రికా రవి అందాల ప్రదర్శన చేశారు. చివరగా చెప్పేది ఏంటంటే? : ‘వీర సింహా రెడ్డి’ ఫెస్టివల్ ఫిల్మ్. పండగ లాంటి సినిమా. అభిమానుల ఆశలు, సగటు కమర్షియల్ ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టు వాణిజ్య హంగులు అన్నీ మేళవించి తెరకెక్కించిన చిత్రమిది. బాలకృష్ణ చేత ఎవరూ చేయించని సాహసం ఇంటర్వెల్‌లో గోపీచంద్ మలినేని చేశారు. అది తప్పిస్తే… మిగతా సినిమా అంతా రొటీన్ ఫ్యాక్షన్ ఫార్ములా & బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ తన భుజాలపై సినిమాను మోశారు. నందమూరి అభిమానులు మెచ్చే చిత్రమిది. ఫ్యాక్షన్ బేస్డ్ యాక్షన్ సినిమాలు నచ్చే ప్రేక్షకులను ‘వీర సింహా రెడ్డి’ శాటిస్‌ఫై చేస్తుంది.

 

Tags; Balakrishna Visvarupa, Veera Vihara

Post Midle