Balaya as Lawyer Saab

Balaya as Lawyer Saab

Date:05/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

సినీ నిర్మాత దిల్ రాజు.. నట సింహం బాలయ్యతో ఎప్పటినుండో ఓ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడు. అందులో భాగంగా చాలా కథలు అనుకున్న కుదరలేదు. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఓ కథ దొరికింది.  అదే హిందీలో అమితాబ్ చేసిన ‘పింక్’. ఈ పింక్ సినిమా అయితే బాలయ్యకు బాగుంటుందని భావించిన దిల్ రాజు.. బాలయ్యకు సూచించడంతో ఆయన కూడ ఓకే అన్నాడట. అయితే ‘పింక్’ వంటి సబ్జెక్ట్  బాలయ్య వంటి మాస్ హీరోకు సూట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న… దిల్ రాజు మాత్రం బాలయ్యతో ఈ క్యారెక్టర్ చేయించాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. అయితే  ప్రస్తుతం బాలయ్య, కే.యస్.

 

 

 

రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమ ా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య.. ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌కు ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ‘పింక్’ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా ‘నెర్కొండ పార్వాయి’ పేరుతో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.అది అలా ఉండగా ‘పింక్’ తెలుగు సినిమా రీమేక్ రైట్స్‌ను దిల్ రాజు మంచి రేటుకే దక్కించుకున్నాడని తెలుస్తోంది. ఈ మూవీకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఈ ‘లాయర్ సాబ్’ సినిమాను దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాణ భాగస్వామ్యంతో తెలుగులో నిర్మించాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

నిండు కుండలా శ్రీశైలం రిజర్వాయర్‌

Tags: Balaya as Lawyer Saab

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *