బాలయ్య సందడి

కర్నూలు ముచ్చట్లు:


అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవలే టర్కీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది.కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది.కర్నూల్లో సినిమా షూటింగ్లోపాల్గొనడానికి బాలకృష్ణ వస్తున్నాడని తెలిసి చిన్న పెద్దా అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.

 

Tags: Balayya Sandadi

Leave A Reply

Your email address will not be published.