తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

ఖమ్మం ముచ్చట్లు :

 

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గురువారం సినీ హీరో, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాలకృష్ణ అటు సినిమాలు, ఇటు రాజకీయాలల్లో తనదైన శైలిలో ముద్ర వేశారని సేవా కార్యక్రమాల్లో తనకెవ్వరు సాటి లేరని నిరూపిస్తున్నారని కొనియాడారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా అనేక మంది ప్రజలకు మెరుగైన క్యాన్సర్ వైద్యం అందిస్తూ పేదల పెన్నిధిగా మారారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం  పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్, ప్రధాన కార్యదర్శులు కేతినేని హరీష్, గుత్తా సీతయ్య, మల్లెంపాటి అప్పారావు, నాగార్జునపు శ్రీను, వక్కంతుల వంశీ, కన్నేటి పృథ్వి, రాజరాజేశ్వరి, నాగ దాసరి, లక్ష్మణ్ కూచిపూడి జై ,చావా రామారావు, కృష్ణ ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Balayya’s birthday celebrations under the auspices of Tedepa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *