సంప్రదాయ బద్ధంగా బాలు అంత్యక్రియల

Date:26/09/2020

చెన్నై ముచ్చట్లు:

పాటల పూదోటలో పుట్టి.. సుస్వర సంగీత మాలికలల్లి .. గాన సరస్వతి కంఠాని కలంకరించి .. సుమధుర గానాంభృతపు జల్లులు కురిపించిన గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం గంధ‌ర్వ లోకానికి ప‌య‌న‌యమ‌య్యారు. అశృన‌య‌నాల మ‌ధ్య  బాలు అంత్య‌క్రియ‌లు తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌లో నిర్వ‌హించారు.  శ్రౌత‌శైవ ఆరాధ్య‌‌ సంప్ర‌దాయం ప్ర‌కారం బాలుని   ఖ‌న‌నం చేశారు. అంత‌క‌ముందు సంప్ర‌దాయబ‌ద్ధంగా వైదిక క్ర‌తువు పూర్తి చేశారు కుటుంబ స‌భ్యులు. ఇక బాలు మ‌న‌కు క‌నిపించ‌రు అంటుంటే అంద‌రి హృద‌యాలు బ‌రువు ఎక్కిపోతున్నాయి. భౌతికంగా బాలు మ‌న మ‌ధ్య లేక‌పోయిన పాట రూపంలో ప్ర‌పంచ‌మంత‌టా ఆయ‌న అంద‌రి మ‌న‌సుల‌లో చిర‌స్థాయిగా నిలిచి ఉంటార‌నేది అక్ష‌ర‌సత్యం.క‌రోనా కార‌ణంగా ఎంజీఎం ఆసుప‌త్రిలో చేరిన బాలు  చికిత్స పొందుతూ క‌న్నుమూసారు .

 

సెప్టెంబ‌ర్ 25 మ‌ధ్యాహ్నం 1.04ని.ల‌కు ఎస్పీబీ తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతి యావ‌త్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాలు పార్ధీవ దేహాన్ని ముందుగా ఆయ‌న కుమారుడు చ‌ర‌ణ్ ఇంటికి త‌ర‌లించ‌గా, అక్క‌డకు అభిమానుల తాకిడి ఎక్కువ‌గా ఉండ‌డంతో రాత్రి 8గంట‌ల ప్రాంతంలో ఫాంహౌజ్‌కు త‌ర‌లించారు. ఫాం హౌజ్‌కు అభిమాన సంద్రం పోటెత్తింది. ముందుగా అభిమానుల‌కు అనుమ‌తినివ్వ‌ని పోలీసులు వారి ప్రేమ‌ని గుర్తించి భౌతిక దూరం పాటిస్తూ చివ‌రి చూపు చూసేందుకు అనుమ‌తినిచ్చారు.

 

శివసాయుధ్యం పొందిన బాలుని చివ‌రి చూపు చూసుకునేందుకు బంధువులు, ప్ర‌ముఖులు, అభిమానులు పోటెత్తారు. ఆయ‌న భౌతిక దేహాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు  క‌న్నీరు మున్నీర‌య్యారు. ఫాం హౌజ్ ప‌రిస‌రాలన్నీ బాలు అభిమానుల‌తో జ‌న సంద్రంగా మారింది.  తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ హాజరయ్యారు.ఇక సినీ సెల‌బ్రిటీలు దేవి శ్రీ ప్ర‌సాద్, భార‌తీరాజా, మ‌నో, సీనియ‌ర్ న‌టుడు అర్జున్, హీరో విజ‌య్ త‌దిత‌రులు అంత్య‌క్రియ‌ల‌లో పాల్గొన్న‌ట్టు తెలుస్తుంది. హీరో అర్జున్ ..బాలుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అన్ని భాష‌ల‌కు చెందిన ప్ర‌ముఖులు దీనిపై గ‌ట్టిగా మాట్లాడాల‌ని అర్జున్ పేర్కొన్నారు.

 

కాలు జారి నన్నపనేని రాజకుమారికి గాయాలు

Tags:Nannapaneni princess injured by slipping leg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *