Natyam ad

బాలినేని వర్సెస్ వైవీ

ఒంగోలు ముచ్చట్లు:


కరు స్వయానా ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మరొకరు మామ.. అంతేకాదు.. వీరిద్దరూ బావ బామ్మర్దులు.. జగన్ కుడి ఎడమ భుజాలుగా ఉంటారు. ఇప్పుడు వీరు ఢీ అంటే ఢీ అంటున్నారు.  వీరిలో ఒకరు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. మరొకరు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇరువురూ వైసీపీలో కీలక నేతలు. ఇటీవలి కాలం వరకూ కలిసి ఉన్న వీరు.. ఇప్పుడు కస్సు బుస్సు అంటున్నారట. వైవీఎస్- బాలినేని తీరుతో జగనన్నకు తల బొప్పికట్టిందని, ఇరువురి మధ్యా విభేదాలు కార్యకర్తలను ఇరకాటంలో పడేశాయని అంటున్నారు. తాజాగా ఒంగోలులో శ్రీనివాస కల్యాణం జరిపించే విషయంలో వీరి మధ్య విభేదాలు బట్టబయలయ్యాయన్నారు.రాజకీయంగా తొలుత కలిసి ఉన్న వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య తర్వాత మనస్పర్థలు పెరిగిపోయాయి. క్రమేపీ పార్టీలో ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరి అనుచరులు కూడా అందుకు భిన్నంగా లేరంటున్నారు. చివరికి కుటుంబ వేడుకలో, దేవుడి కార్యక్రమం శ్రీనివాస కల్యాణం ఏర్పాటు విషయంలోనూ వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. చినికిచినికి గాలివానలా మారి వ్యవహారం జగన్ దాకా వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది.బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనవడి పుట్టినరోజు నవంబరు 9. ఆ సందర్భంగా అదే రోజు ఒంగోలులో శ్రీనివాస కల్యాణం జరిపించాలనుకున్నారు. నిబంధనల ప్రకారం 3 నెలల ముందే టీటీడీకి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు చేశారు. ఈఓ ధర్మారెడ్డి ఆయనకు సన్నిహితుడు కావడంతో అనుమతి తొందరగానే లభించింది. బాలినేని ఆ వెంటనే స్వామి దర్శనానికి వెళ్లి అనుమతి పత్రాలు అందుకున్నారు.

 

 

 

 

9న ఒంగోలులో ప్రజల శ్రేయస్సు కోసం శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 50 వేల మంది భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.టీటీడీ చైర్మన్ ను సంప్రదించలేదంటూ.. శ్రీనివాస కల్యాణం నిర్వహణకు సహకరించలేమంటూ కొద్ది రోజుల కిందట టీటీడీ అధికారుల నుంచి బాలినేనికి సమాచారం వచ్చిందట. టీటీడీ చైర్మన్ ను సంప్రదించలేదనీ.. కనీసం పాలకమండలికైనా లేఖ పంపలేదనే సాకుతో అనుమతులు నిలిపేశారట. దీంతో బాలినేనికి కోపం వచ్చింది. ఇచ్చిన అనుమతులు ఎలా రద్దుచేస్తారని బాలినేని ప్రశ్నించారట. అయినా చైర్మన్ ని కాదని ఎవరూ సమాధానం చెప్పలేదట. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట సీఎంను కలిసిన  బాలినేని  సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని, వైవీ జోక్యంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించినట్లు సమాచారం. తాను కూడా చాలా అడ్డంకులు సృష్టించగలనని, సీఎం సూచనలతో సర్దుకుపోతున్నానని చెప్పారని తెలిసింది.బాలినేని ఫిర్యాదుపై పరిశీలించి చర్యలు తీసుకుంటానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

 

 

 

Post Midle

తర్వాత వైవీని పిలిపించి జగన్ మాట్లాడారు. ఒంగోలులో శ్రీనివాస కల్యాణం నిర్వహణకు ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇంతలో బాలినేని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లడంతో వివాదం ముదిరిందని, ఒంగోలులో శ్రీనివాస కల్యాణం ఇక లేనట్లే అని ప్రచారం జరిగింది. అయితే తాజాగా శ్రీనివాస కల్యాణం నిర్వహణకు టీటీడీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిసింది.వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు చాలాకాలం నుంచే ఉన్నాయి. జగన్ జోక్యం చేసుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను బాలినేనికి కేటాయించి… ఉత్తరాంధ్ర బాధ్యతలు వైవీకి అప్పగించారు. అయినా ఇద్దరూ కలవకపోగా పంతాలకు పోయి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటుండడం గమనార్హం.

 

Tags: Ballineni vs. Yv

Post Midle