జగిత్యాలలో బాలు జయంతి వేడుకలు…

జగిత్యాల ముచ్చట్లు :

బాలు గళం అజరామరమైనదని, భౌతికంగా మన మధ్య లేకున్నా పాట రూపంలో సజీవుడని కళాశ్రీ అధినేత గుండేటి రాజు అన్నారు. శుక్రవారం కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ జగిత్యాల ఆధ్వర్యంలో స్వర్గీయ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి వేడుకలను స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
బాలు చిత్ర పటానికి పూల మాలలు వేసి రెండు నిమిషాలు మౌనం వహించి జయంతి నివాళులు అర్పించారు.దాదాపు 30 వేల పాటలను వివిధ భాషలలో పాడిన గొప్ప గాయకుడని సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్థిస్టుగా, కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన మేధావి అని గుండేటి రాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, ఎలిగేటి రాజేంద్రప్రసాద్, ఎలుగందుల రవి, గొల్లపెళ్లి శ్రీరాములు గౌడ్, కొమురవెల్లి లక్ష్మీనారాయణ,గాయకుడు అభి, భానుక మహేష్,బండారి వెంకటేశ్వర్లు, సాహితీవేత్తలు మద్దెల సరోజన, అయిత అనిత,వంగ గీతారెడ్డి, మాడిశెట్టి శ్రీనివాస్, ఓదెల గంగాధర్,  అమనిగంటి స్వప్న, నమిలికొండ సాకేత, ఉజగిరి జమున, లక్కారాజు శ్రీలక్ష్మి, ములస్తం లావణ్య తదితరులున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Balu Jayanti celebrations in Jagittala ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *