బామ్మర్ది అన్నాడని చంపేశాడు
అపార్థంతో యువకుడిపై దాడి
నిర్మల్ జిల్లాలో దారుణం..
నిర్మల్ ముచ్చట్లు:
ఓ యువకుడు బామ్మర్ది తిన్నావా..! అడగగా తననే అన్నాడని అపార్థం చేసుకుని అతడిపై దాడి చేశాడు మరో యువకుడు. ఈ ఘటనలో యువకుడిని మర్మాంగాలపై తన్నడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో జరిగింది కుబీర్ మండలం నిగ్వా గ్రామంలో ఒకే వాడకు చెందిన శ్రీకాంత్, శ్రీనివాస్ వీధి అరుగుపై కూర్చొ ని బామ్మర్ది తిన్నావా? అని శ్రీనివాస్ శ్రీకాంత్ ను అడిగాడు…ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న సాయిప్రసాద్ తన నే అన్నాడని అపార్థం చేసుకుని గొడవకు దిగాడు ఈ క్రమంలో కొట్టుకున్నా రు…శ్రీనివాస్ (20) మర్మాంగాలపై సాయిప్రసాద్ దాడి చేయడంతో కుప్పు కూలి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సాయి ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Bammardi killed him
