బోయకొండ లో ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలకు నిషేదం

– నిబంధనలు పాటించాలని ఆదేశాలు
– పర్యావరణం ను పరిరక్షించుకుందామని పిలుపు
-భక్తులు సహకరించాలన్న చైర్మన్‌ మిద్దింటి

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు, వాడకంను నిషేధించినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ తెలిపారు.మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలమేరకు ఆదివారం ఈఓ చంద్రమౌళితో కలిసి బోయకొండ ఆలయం వద్ద గల దుఖాణాలు, కొండ క్రింద ప్రాంతంలో గల దుఖాణాల్లో పరిశీలించారు. పర్యావరణం పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ కవర్ల విక్రయం వాడకంను అరికట్టాలని నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. అందరూ నిబంధనలను పాటించాలని , ఉల్లంగిస్తే జరిమానా విధించనున్నట్లు చెప్పారు. బోయకొండపై కోట్లాదిరూపాయలతో ఆహ్లాదకరమైన వాతావరణంను తలపించేలా మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో అభివద్ది చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి ప్రదేశంలో ఎక్కడ పడితే అక్కడ కవర్లు దర్శనమిస్తుండడం, వాటి వాడకం వలన కలిగే అనర్తాలను వివరిస్తూ ఫ్లెక్సీలను సైతం ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నట్లు చైర్మన్‌ తెలిపారు. దుఖాణాల దారులకు తొలిసారిగా హెచ్చరికలు చేశారు. పేపరు బ్యాగులను మాత్రమే విక్రయించాలని, భక్తులకు కూడా సహకరించి కవర్ల వాహకం నిషేధానికి సహకరించాలని కోరారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Ban on sale of plastic covers in Boyakonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *