బంద్ ను విజయవంతం చేయాలి

Date:17/10/2019

సూర్యాపేట ముచ్చట్లు:

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ ధర్మార్జున్ సంఘీభావం తెలిపారు. గురువారం సూర్యాపేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గోన్నారు. కోదండరాం మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని పదే పదే చెబుతున్న సీఎం, ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్రాన్ని ఇద్దరు,ముగ్గురు పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారు. కాంట్రక్టర్ల ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని విమర్శించారు. . ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు ఎవరు కారణం కాదు….కెసిఆర్ మాత్రమేనని అన్నారు. ఆర్టీసీ సమ్మె విజయవంతం కోసం తెలంగాణ సమాజం మొత్తం అండగా నిలుస్తుంది. కెసిఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మొత్తం ఏకమవుతున్నది. ఆంధ్ర పాలకులను తరిమికొట్టిన మనకు…కెసిఆర్ మెడలు వంచడం పెద్ద పనేం కాదు.  19 న జరిగే రాష్ట్ర బంద్ కు అందరూ సహకరించి విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

పోలీసు అమర వీరుల కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి నాని

Tags; Bandh must be succeeded

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *