కేజీ టూ పీజీ విద్యాసంస్థలు బంద్ విజయవంతం    

మంథని ముచ్చట్లు:


రాజస్తాన్ లో దళిత  విద్యార్తి ఇంద్ర కుమార్ మెగ్వాల్ ఆత్యను కండిస్తూ  మహ జన నేత మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు కేజీ టూ పీజీ విద్య సంస్థలు మంగళవారం దేశ వ్యాప్తంగా బంద్ చేయడం జరిగినది. అందులో  భాగంగానే మంగళవారం మంథని పట్టణం లోని  కేజీ టూ పీజీ వరకు అన్ని విద్యాసంస్థలను ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎమ్మెస్ఎఫ్ నాయకులు పూర్తి స్థాయిలో బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎమ్మెస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న ప్రదాని మోడీ కి దళితుల పట్ల సానుభూతి కూడా లేదని అంటరాని తనాన్ని నిర్ములన కోసం మోడీ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని ఇంద్రకుమార్ మెగ్వా ల్ హత్య పై ప్రధాని మంత్రి మౌనం నిందితులకు పరోక్షంగా మద్ధతు గా నిలబడటమే అవుతుందన్నారు.

 

 

 

75 ఏండ్ల స్వాతంత్ర్యం అంటరాని తనాన్ని నిర్ములిచా లేక పోయిందని గుర్తు చేస్తున్నామన్నారు. ప్రధాని మోడీ ఏజెండా లో కనీస కార్యక్రమం లేదని గుర్తు చేస్తున్నమన్నారు. స్కూల్ లో కుండ లోని నీళ్లు త్రాగడాని కొట్టి చంపిన రక్షశ టీచర్ను కఠినంగా శిక్షించాలని ఈ విషయంలో ప్రధాని మౌనం వీడి ఇంద్ర కుమార్ మెగ్వా ల్ కుటుంబానికి నాయ్యం చేయాలని డిమాండ్ చేశారు.ఈ  బంధు కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టి మంథని నియోజకవర్గ ఇంచార్జి       మంథని చందు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ సింగారపు సుధాకర్, ఎంఎస్పి కో కన్వీనర్ సింగారపు అశోక్ కుమార్, ఎంఎస్ఎఫ్ నాయకులు నెదురు రవి మాదిగ,బెజ్జల అనిల్ మాదిగ, వేల్పుల శ్రవణ్ మాదిగ, కొయ్యల వినయ్ మాదిగలు పాల్గొన్నారు.

 

Tags: Bandh of KG to PG educational institutions is successful

Leave A Reply

Your email address will not be published.