పరిగిలో బంద్ ప్రశాంతం

Date:19/10/2019

వికారాబాద్  ముచ్చట్లు:

 

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్ లో భాగంగా  వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రశాంతంగా బంద్  కొనసాగింది. పరిగి ఆర్టీసీ డిపోలో  నుంచి బస్సులు ఒక్కటి కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది .పరిగి నియోజకవర్గంలోని  పూడూర్, దోమ, కుల్కచర్ల  చెందిన మండలాల్లో   వ్యాపారస్తులు సమ్మెకు  మద్దతుగా తమ దుకాణాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్  పాల్గొన్నారు.మరోవైపు అఖిల  పక్ష నాయకులను పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు .దీంతో పరిగిలోని అన్ని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఇదే అదునుగా భావించిన కొందరు ప్రైవేటు వాహనదారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రయాణికుల నుంచి ఇష్టం వచ్చినంత వరకు డబ్బులు దండుకుంటున్నారు.

మద్యం మత్తులో యువకుడి కారు డ్రైవింగ్…ఎస్సైకు తీవ్ర గాయాలు

Tags: Bandi calm in Parigi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *