Natyam ad

బండి సంజయ్ కు క్రేజ్

కరీంనగర్ ముచ్చట్లు:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన బండి సంజయ్‌పై అటు బీజేపీ శ్రేణుల్లో… ఇటు అభిమానుల్లో సింపతీ ఓ రేంజ్‌లో పెరిగింది. అయితే.. అది మోదీ పర్యటన వేదికగా బయటపడింది. మోదీ పర్యటన సందర్భంగా.. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించి బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. అయితే.. సభా స్థలికి చేరుకున్న బండి సంజయ్ చూసిన పార్టీ శ్రేణులు.. ఆయనకు గ్రాండ్‌గా వెల్ కం చెప్పారు. దారిపొడవునా ఆయనతో సెల్ఫీలు తీసుకుంటూనే ఉన్నారు. ఇదంతా ఒకఎత్తైతే.. గ్రౌండ్‌లో ఎంటరవగానే.. ఆయనను తమ భుజాలపై ఎత్తుని వేదిక వరకు మోసుకెళ్లి తమ అభిమానాన్ని తెలిపారు కార్యకర్తలు. ఇదిలా ఉంటే.. మోదీ సభ ముగిసిన అనంతరం.. వీవీఐపీ గ్యాలరీ నుంచి బండి సంజయ్ బయటకు వచ్చే సమయంలో.. కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు.బండి సంజయ్‌ను మళ్లీ తమ భుజాల మీద మోసుకుంటూనే బయటకు తీసుకొచ్చారు. అయితే.. బయటకు తీసుకొస్తున్న సమయంలో.. అభిమానులు ఆసక్తికర నినాదాలు చేశారు. సీఎం సంజయ్.. సీఎం సంజయ్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. తనను దించాలని బండి సంజయ్ కోరినా..

 

 

 

Post Midle

కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోకుండా నినాదాలు చేసుకుంటూ బయటి వరకు మోసుకొచ్చారు. అయితే.. కార్యకర్తలు తనపై చూపిస్తున్న అభిమానానికి బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లు చమర్చాయి.ఇదిలా ఉంటే.. బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. మోదీ సభకు సీఎం కేసీఆర్‌ రాకపోవటంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కోసం వేదికపై కుర్చీ వేశామని.. చాలా సేపు ఆయన కోసం ఎదురు చూశామని.. ఆయన వస్తే సన్మానం చేసేందుకు శాలువా కూడా తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తే.. సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదంటూ నిలదీశారు. కేసీఆర్‌కు అంత ముఖ్యమైన పని ఏముందని.. ఆయన ఈరోజు షెడ్యూల్‌ను బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

 

Tags: Bandi is crazy about Sanjay

Post Midle