బండి సంజయ్ బతుకమ్మ శుభాకాంక్షలు

Date:24/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

ఉభయ తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్  సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈమేరకు ఒక  ప్రకటన విడుదల చేసారు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకొని ప్రతి గ్రామంలో నగరంలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం,అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ పరంపరగా కొనసాగడం ప్రజల సంఘటిత శక్తిని నిరూపిస్తోందని అయన అన్నారు. . తెలంగాణ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ విజయదశమి పండగలసందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా తాము చేపడుతున్న కార్యక్రమాల్లో సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారి ప్రజా జీవితంలోని అన్ని రంగాల్లోవ్యక్తిగత సామాజిక కష్టాలను తెచ్చిపెట్టింది. విజయదశమి సందర్భంగా కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన కష్టాలనుండి అధిగమించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కోన్నారు.

డిమాండ్ లేకుండా  బంతిపూలు

Tags: Bandi Sanjay Batukamma Greetings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *