చిటకోడూరులో బండి సంజయ్ పాదయాత్ర

జనగామ ముచ్చట్లు:


జనగామ జిల్లా చిటకోడూరు సమీపంలోని రాత్రి శిబిరం నుంచి బండి సంజయ్ పాదయాత్ర శుక్రవారం ప్రారంభమయింది. చీటకోడూరు నుంచి చౌడారం, చౌడారం భాషా తండా, రామచంద్రగూడెం, లక్ష్మీతండా, మాదారం మీదుగా ఖిలాషాపూర్ వరకు అయన కొనసాగింది. చీటకోడూరులో బండి సంజయ్ కి స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆడపడుచులు బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో యువత  స్వాగతం పలికారు. సంజయ్ చీటకోడూరులో పార్టీ జెండా ఆవిష్కరించారు. చీటకోడూరు లోని “వర్ధన్ ఆశ్రమంలో అనాధ పిల్లలతో” కలిసి శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అనాధ పిల్లలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేసారు. పలువురు అనాధ చిన్న పిల్లలకు స్వయంగా స్వీట్లు తినిపించారు. ఆశ్రమ నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.  తరువాత కొంత ఆర్థిక సాయం చేసారు.

 

Tags: Bandi Sanjay Padayatra in Chittakodur

Leave A Reply

Your email address will not be published.