Natyam ad

బండి సంజయ్ ను భర్తరఫ్ చేయాలి

నర్సంపేట ముచ్చట్లు :


గత రెండు రోజులుగా చర్చ జరుగుతున్న వరంగల్ జిల్లా పదవ తరగతి పరీక్షల పేపర్ లీకేజ్ ఉదంతంపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. పేపర్ లీకేజ్ కి పాల్పడి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్దేశ్యంతో యువతను ఇలాంటి చర్యలకు ఉసిగొల్పినట్టు, పోలీస్ విచారణలో సాక్షాదారాలతో బయటపడిన దొంగ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చర్యలను ప్రశ్నిస్తూ, భాజపా వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పట్టణ కమిటీకి పిలుపునిచ్చారు.ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధంచేసి, ఎం.పీ పదవి నుండి వెంటనే భర్తరఫ్ చేసి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
తెలంగాణ సమాజంలో అలజడి సృష్టించి, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యే విధంగా పేపర్ లీకేజ్ కొరకు యువతను ప్రోత్సహించిన బండి సంజయ్ ను& భాజాపా పార్టీని తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతం నుండి బహిష్కరించాలని కోరారు.

 

 

పేపర్ లీకేజ్ కు పాల్పడిన వ్యక్తి బండి సంజయ్ తో పాటు భాజపా ముఖ్య నాయకుల అందరితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వాటినే సాక్ష్యంగా.. బిజెపి కి అతనికి ఉన్న సాన్నిహిత్యంతోనే ఉద్దేశ్య పూర్వకంగా వాళ్లు కావాలనే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు తెలిపారు.
పోలీసు పర్యవేక్షణలో అన్ని రూల్స్ పాటిస్తూ, సిస్టమ్యాటిక్ గా నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రంలోకి ఆ సదరు బిజెపికి చెందిన వ్యక్తి గోడ దూకి మరీ అక్రమంగా పరీక్ష కేంద్ర0లోకి చొరబడాల్సిన అవసరం ఏముంది…?
పరీక్ష పేపర్ ని ఫోటో తీసుకొని ఆ ఫోటోను వెంటనే బండి సంజయ్ కి పంపాల్సిన అవసరం ఏముంది..?
ఇంతేకాక వేరే వేరే జిల్లాల్లో పరీక్ష పేపర్లు లీకైనట్టు వస్తున్న ఉదంతాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ పాత్ర దాగి ఉంటుందని  స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు నర్సంపేట రూరల్ మండలాధ్యక్షులు ఎంపీపీ మరియు జడ్పిటిసి గార్లు, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, క్లస్టర్స్, ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Midle

Tags: Bandi Sanjay should be replaced

Post Midle