గణనాధుని సేవలో బెంగళూరు సిటీ పద్మనాభ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి
రఘునాథ నాయుడు
కాణిపాకం ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కస్తూరి నాయన పల్లి గ్రామానికి చెందిన రఘునాథ నాయుడు బెంగళూరు సిటీ పద్మనాభ నగర్ 171 లో పోటీ చేయుచున్న కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చేస్తున సేవలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి బెంగళూర్ సిటీలోని పద్మనాభ నగర్ కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు..స్వామివారి దర్శనం కోసం కాణిపాకం విచ్చేసిన రఘునాథ నాయుడు ను ఆయన గ్రామస్తులు,మిత్రులు ఘనంగా స్వాగతం పలికారు… అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాణిపాకం వినాయక స్వామి ఆలయాన్ని ఊహించిన విధంగా అభివృద్ధి కి సహకరిస్తానన్నారు
స్వామి వారికి భారీగా విరాళాలు అందజేస్తాను అన్నారు..ఆలయ అభివృద్ధిలో తనంత కృషి చేస్తానని తెలిపారు.

Tags: Bangalore City Padmanabha Nagar Congress Candidate in Ganasadhuni Seva
