కంట్రోల్ లోకి క‌రోనా

Date:19/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు

 

కరోనా మహమ్మారితో వణికిపోతున్న ప్రజలకు శుభవార్త. దేశంలో ఫిబ్రవరి నాటికి వైరస్ పూర్తిగా అంతమవుతుందట. వైరస్ వ్యాప్తి ఇప్పటికే పీక్ దశను దాటేసిందట. దేశంలో కొవిడ్-19 వ్యాప్తి అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ వివరాలు చెప్పింది. కొత్తగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం శుభసూచకమని పేర్కొంది. ఇదే సమయంలో పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళలో ఓనమ్ పండుగ తర్వాత పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదైన విషయాన్ని గుర్తు చేసింది. శీతాకాలంలో వైరస్ రెండో సారి విజృంభించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది.

భారత్‌లో కరోనా వైరస్‌ ముమ్మర దశను దాటిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి మహమ్మారి పూర్తిగా అంతం అవుతుందని కమిటీ పేర్కొంది. కొవిడ్‌-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని ప్రజలను కోరింది. 2021 ఫిబ్రవరి నాటికి వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చే సమయానికి దేశవ్యాప్తంగా కోటి ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడతారని కమిటీ అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం  పాజిటివ్ కేసుల సంఖ్య 75 లక్షలు.దేశంలో ప్రస్తుతం నెలకు సరాసరి 26 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా కేసుల్లో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది.

 

దేశంలో ఇప్పటివరకు కేవలం 30 శాతం మంది మాత్రమే కరోనా వైరస్‌కు రోగనిరోధక శక్తి  కలిగి ఉన్నారు. ప్రజలు కొవిడ్-19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందే. నిబంధనలను కచ్చితంగా పాటిస్తే వచ్చే సంవత్సరం (2021) ప్రారంభంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. కరోనా అదుపులోకి వచ్చే నాటికి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య కోటి ఐదు లక్షలకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ సంఖ్య 75 లక్షలుగా ఉంది. దేశంలో సెప్టెంబర్ 17 ఒక్క రోజే గరిష్టంగా 98 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు. కరోనా మహమ్మారి బారినపడి దేశంలో ఇప్పటివరకు 1.14 లక్షల మంది మరణించారు. వైరస్ అదుపులోకి వస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలను తొలగించి, అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇవ్వవచ్చు.ప్రజలు గుమిగూడితే కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని కమిటీ హెచ్చరించింది. ఇందుకు కేరళను ఉదాహరణగా పేర్కొంది. కేరళలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఓనం పండుగ నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడారని.. స్నేహితులు, బంధువులను ఎక్కువగా కలిశారని, ఆ తర్వాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని వివరించారు.

బంగ్లా అమ్మాయిలే టార్గెట్

Tags:Bangla Girls Corona into TargetControl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *