రైతులను వేధిస్తున్న బ్యాంకర్లు

నల్గొండ ముచ్చట్లు:

 

రైతును రాజును చేస్తామన్న రాజ్యంలో కనీసం మూడుపూటల కూడు దొరకని పరిస్థితి దాపురించింది. రైతు సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్నమని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న పథకాలకు ఎసరు పెడుతూ రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. వ్యవసాయ రంగంలో రైతులను ప్రోత్సహించేందుకు వడ్డీ లేని రుణాల కింద పంట రుణాలు ఇస్తూ రైతులకు అండగా నిలువాల్సిన ప్రభుత్వాలు వడ్డీ చెల్లింపుల్లో కోతలు విధిస్తున్నాయి. దాంతో రైతులపై వడ్డీ భారం మోపడంతో వడ్డీలు చెల్లించలేక రైతులు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతేడాది పంట సాగు విస్తీర్ణం 8.20లక్షల ఎకరాలు. ఇందుకుగాను పంట రుణాల కింద రూ. 20వేల కోట్లు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి నిర్ణయించింది. కానీ జిల్లాలో 52 శాతం అంటే.. రూ. 12 వేల కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. ఈ రుణాలకు సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ సుమారు. రూ. 840 కోట్లు ఉంటుందని లీడ్‌ బ్యాంక్‌ అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4శాతం వాట కింద వడ్డీలు చెల్లించాల్సి ఉంది. కానీ నేటికి ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి నెలకొంది.

 

 

 

ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీ ఖాతాలో జమ చేస్తాము కానీ ముందు మీరు వడ్డీలు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలు చెల్లిస్తే గానీ ప్రస్తుతం పంట సాగు పెట్టుబడి రుణాలు ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నారు. అయినప్పటికీ పాలకవర్గాలు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2019-20 ఏడాదికి సంబంధించిన రుణాలకు వడ్డీ కింద చెల్లించాల్సిన రూ.700 కోట్లకు రూ.250 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.450 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక 2020-21 ఏడాదికి సంబంధించిన వడ్డీలు చెల్లించుడు ఇప్పట్లో అయ్యేపని కాదని బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇవ్వకపోగా వడ్డీలు ముక్కు పిండి వసూలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. పంట సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాలు ఇస్తోంది. ఆయా ప్రాంతాల్లో పంట సాగు వ్యయాన్ని బట్టి స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ ప్రకారం రుణాలు ఇస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎకరా వరి సాగుకు రూ. 35వేలు, పత్తి, కందికి రూ. 28వేల నుంచి 32 వేల వరకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఇందుకు లక్షలోపు రుణం తీసుకున్న రైతు తరుపున వడ్డీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. కానీ గతేడాది నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు చెల్లించకపోవడంతో రైతులపై వడ్డీల భారం పడుతుంది.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Bankers harassing farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *