దొంగ నోట్ల ముఠా పట్టివేత-ముగ్గురు అరెస్టు
బద్వేలు ముచ్చట్లు:
దువ్వూరు మండలం కానగూడూరు గ్రామం వద్ద దొంగ నోట్ల చలామణికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా మాచర్ల కు చెందిన యేసయ్య, గంగవరపు సాగర్ రెడ్డి, ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్ కు చెందిన యంగనం పల్లె కోటేశ్వరరావు లను అరెస్టు చేసి 200 రూపాయల 59 దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్లు ముద్రించే ప్రింటర్, లామినేటరు, పేపర్ కటింగ్ మిషన్ ను దువ్వూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మైదుకూరు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. మైదుకూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేంద్ర రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రారెడ్డి మరియు సబ్ డివిజనల్ క్రైమ్ పార్టీ సిబ్బంది లను ఎస్పీ అన్బురాజన్ అభినిందించారు.
Tags; Bankruptcy gang nabbed-three arrested

