Natyam ad

నుడా వైస్ చైర్మన్ గా బాపిరెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు అర్బన్ రెవెలప్మెంట్ వైస్ చైర్మన్ గా తెలుగు గంగ స్పెషల్ కలెక్టరుగా విధులు నిర్వహిస్తున్న టి. బాపిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .గతంలో బాపిరెడ్డి నుడా వీసీ గా పనిచేసివున్నారు .2వ సారి  నుడా వీసీగా బాపిరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు .గతంలో ఈయన వీసీగా పనిచేసినప్పుడు అక్రమలే అవుట్లపై  అపరాధరుసుము వేసి దాదాపు పది కొట్ల రూపాయల   దాకా  ప్రభుత్వానికి అదాయం సమకూర్చారు.ప్రస్తుతం నుడా పరిథిలో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ లే ఔట్లు వెలసి ఉన్నాయి .నుడా అవినీతి ఊబిలో కూరుకపోయి ఉంది .గత ,ప్రస్తుతం తప్పుకోనున్న వీసీ లు నుడా ని చట్టవిరుద్ద పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు .ఇష్టానుసారంగా అందిన కాడికి దోచుకున్నారు. ఆ సమయంలో కోట్లాన్ కోట్ల రూపాయలు  గోల్మాల్ అయ్యాయి .ప్రభుత్వం లే అవుట్లు వేసి ప్లాట్లు విక్రయించేందుకు రూపుదిద్దుకుంటున్న లే అవుట్ కి బాంకర్లు ఇచ్చిన కోట్ల రూపాయల్లో కొంత అక్రమంగా అనవసర పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో బాపిరెడ్డి 2వ సారి వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో సింహపురి ప్రజలు ఆయన సేవలు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

 

Tags: Bapireddy as Nuda Vice Chairman

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.