బార్ కౌన్సిల్ సభ్యుల ఆకాంక్షలను నెరవేరుస్తాం

Date:03/04/2019

నెల్లూరు ముచ్చట్లు :
బార్ కౌన్సిల్ సభ్యుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి తెలిపారు జిల్లా కోర్టు లోని బార్ కౌన్సిల్ హాలులో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మీయ సమావేశం లో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి  ఆదాల పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి నందుకు ధన్యవాదాలు తెలిపారు రానున్న ఎన్నికల్లో బార్ కౌన్సిల్ సభ్యులు అయిన న్యాయవాదుల మద్దతు కోరుతున్నామని చెప్పారు ఇంతవరకు మీ సమస్యలు మా దృష్టికి రాలేదని ఎన్నికల తర్వాత వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు సంక్షేమం  నిధి  తదితర సమస్యల గురించి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో గెలుపునకు మీ వంతుగా న్యాయవాదులు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు  తనను  అ కారణంగా దూషించిన విధానాన్ని ఆయన ఖండించారు . న్యాయవాదులు ఎన్నికల్లో తమ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వై.వి రామిరెడ్డి కోటేశ్వర్ రెడ్డి మల్లు సుధాకర్ రెడ్డి అబూబకర్ బార్ కౌన్సిల్ కార్యనిర్వాహకులు రోజా రెడ్డి, ఫణి రత్నం వేనాటి చంద్రశేఖర్ రెడ్డి  గూడూరు సుబ్బారెడ్డి  తదితరులు పాల్గొన్నారు .
Tags:Bar Council Members’ wishes will be fulfilled-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *