బారులు బార్లా.. (వరంగల్)

Barla Barla .. (Warangal)

Barla Barla .. (Warangal)

Date:11/06/2018
వరంగల్‌ అర్బన్‌ ముచ్చట్లు:
నగరంలో వేళాపాళాలేకుండా మద్యం అమ్మ కాలుజోరుగా సాగుతున్నాయి. తెల్లవారక ముందే గ్లాసులు గలగలమంటున్నాయి. కొన్ని బార్లు, వైన్‌ షాపుల వారు గుట్టుచప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యం ప్రి యులకు కావలసిన అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచి అమ్మకాలు జరుపుతున్నారు. కాజీపేట, వరంగల్‌, హన్మకొండ ప్రాంతాల్లో 94 బార్లు, 59 రిటైల్‌ వైన్‌ షాపులు ఉన్నాయి. కొన్ని బార్లలో ప్రభుత్వం నిర్ధేశించిన వేళలను పాటించకుండా తెల్లవారక ముందే లూజ్‌ అమ్మకాలు మొదలుపెడుతున్నారు. ఉదయం 5గంటలకే నగరంలో మద్యంషాపు లు, బార్ల ముందు మందుబాబులు బారులు తీరుతున్నారు. హన్మకొండ 100 ఫీట్ల రోడ్డు, నయీంనగర్‌, కుమార్‌పల్లిలోఉన్న కొన్నిమద్యం షాపుల్లో మద్యం 24గంటలు ఏరులై పారుతోం ది. మందుకొట్టిన మందుబాబులు షాపుల వద్ద ఉన్న ఇసుక డంపులపై కూర్చుండి టైంపాస్‌ చేస్తున్నారు.
శివనగర్‌, వరంగల్‌ బస్‌స్టేషన్‌ సమీపంలో రెండు షాపుల ముందు తెల్లవారక ముందే జాతర వాతావరణం కనిపిస్తోంది. ప్రొఫెషనల్‌ తాగుబోతులతో పాటు కొందరు మహిళలు సై తం ఇక్కడ నుంచి మద్యం తీసుకెళ్లుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. హన్మకొండలో నయీంనగర్‌, లష్కర్‌బజార్‌, కుమార్‌పల్లి, హన్మకొండ చౌర స్తా, కేయూ రోడ్డు, 100 ఫీట్ల రోడ్డు, హన్మకొండ కొత్త బస్‌స్టాండ్‌, ఇకవరంగల్‌లో స్టేషన్‌రోడ్డులో 4 షాపులు, బీటుబజార్‌, జేపీఎన్‌ రోడ్డు, పాత బీటుబజార్‌లో 2, ఖిలావరంగల్‌, అండర్‌ రైల్వేగేటు, కరీమాబాద్‌,మిల్స్‌కాలనీలో కొన్ని మద్యం షాపుల్లో ఉదయం 5గంటల నుంచే అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కాజీపేటలో విష్ణుపురి, కాజీపేట రైల్వేస్టేషన్‌ ప్రాంతం, సోమిడి రోడ్డు, ఫాతిమానగర్‌ సమీపంలో ఉద యం నుంచి తిరిగి ఉదయం తెల్లవారే వరకు మద్యంఅమ్మకాలు రహస్యంగా నడుస్తున్నాయి.
నగరంలో సమయపాలన పాటించకుండా అమ్మకాలు జరిపే మద్యం షాపుల నిర్వాహకు లు నైట్‌ పెట్రోలింగ్‌ చేసే పోలీసు సిబ్బందిని తమదైన పద్ధతుల్లో మేనేజ్‌ చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులకు నెలవారీ మామూళ్లతో పా టు మద్యం, బిర్యానీ పార్సిల్స్‌ నజరానాగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలో వివిధ చోట్ల మద్యం సేవించిన వారికి అర్ధరాత్రి తర్వాత కూడా మండిబజార్‌లోని ఓ బిర్యానీ పాయింట్‌ లో వేడి వేడి బిర్యానీ అందుబాటులో ఉంటుంది. దీంతో ఇక్కడ పెద్దసంఖ్యలో కస్టమర్ల తాకిడి ఉంటుంది. ముడుపులు అందని పక్షంలో పోలీసులు ఇక్కడ పార్క్‌ చేసే కస్టమర్ల బైక్‌ల తాళాలు, ప్లగ్‌లు తీసుకుని వెళ్తారని తెలిసింది. డబ్బులతో పాటు బిర్యానీ అం దితే గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోతారనే ఆరోపణలు ఉన్నాయి.
నగరంలో తెల్లవారకముందు నుంచే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఎక్సైజ్‌ అధికారులకు తెలుసు. కానీ, నెలవారీ మామూళ్లు ముడుతుండటం వల్ల చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతీ షాపు నుంచి నెలకు రూ.5వేల నుంచి రూ.8 వేల వరకు టంచన్‌గా ముడుపులు అందుతాయని తెలిసింది. మామూళ్ల వసూళ్లకు ప్రత్యేకంగా ఆ శాఖలో యూనియన్‌ నాయకునిగా చలామని అయ్యే ఓవ్యక్తిని కేటాయించినట్టుసమాచారం.
 ప్రభుత్వం సూచించిన విధంగా బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11గంటల వరకు, వైన్‌ షాపులు ఉదయం 11గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. కానీ, నగరంలో చాలా చోట్ల ఉదయం 5గంటల నుంచి తెల్లవారే వరకు నిర్విరామంగా అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. సంబంధిత ఎక్సైజ్‌ శాఖ, స్థానిక పోలీసులు మామూళ్ల మత్తు వీడడం లేదనే విమర్శలు ఉన్నాయి. బార్లలో 11గంటల నుంచి రాత్రి 2గంటల వరకు షాపుల ముందు షట్టర్‌ మూసివేసి వెనుక నుంచి అమ్మకాలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరు.
Tags:Barla Barla .. (Warangal)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *