నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న బసంత్ నగర్ పోలీసులు

పెద్దపల్లి  ముచ్చట్లు :

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేంద్రంలోని బిసి కాలనీలో నిషేదిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు బసంత్ నగర్ ఎస్ఐ మహేందర్ కుమార్, సిబ్బంది శ్ తో కలిసి దాడులు నిర్వహించారు. బిసి కాలనీ మందల సంపత్ రెడ్డి ఇంట్లో తనిఖీ నిర్వహించగా రూ.5000 విలువ గల ప్రభుత్వ నిషేదిత పొగాకు ఉత్పత్తులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని మందల సంపత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం బసంత్ పోలీస్ స్టేషన్ లో తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Basant Nagar police seize illicit tobacco products

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *