-నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది.
-పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష (17) బలవన్మరణానికి పాల్పడింది.
-ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణంగా పోలీసులు చెబుతున్నారు.
-ఈ విషాద ఘటన గురువారం (ఫిబ్రవరి 22) చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి ముచ్చట్లు:
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన తెనుగు శిరీష బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్టియర్ చదువుతుంది. బుధవారం తన ఇంటి నుంచి బయల్దేరిన శిరీష గురువారం వర్సిటీకి చేరుకుంది. అదే రోజు రాత్రి హాస్టల్‌లోని తన గది (రూం నెం 117)లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన హాస్టల్ సిబ్బంది బాలికను క్యాంపస్ హెల్త్‌సెంటర్‌కి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందిందని నిర్ధారించారు. శిరీష మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడినట్టు క్యాంపస్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిరీష గదిని . గదిలో లభ్యమైన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
శిరీష రాసిన సూసైడ్ నోట్‌లో పలు విషయాలు వెల్లడించింది. తాను ప్రాణంగా ప్రేమించిన బావ ఆకాశ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొంది. బావ ఆకాశ్ మృతిని తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొంది. నేను ఇలా చేయడం తప్పని తెలుసు. నన్ను క్షమించండి. మీరు బాధపడతారని తెలుసు. కానీ బావ లేని జీవితం నాకెప్పటికీ శూన్యమే. అందుకే నేను తన దగ్గరికి వెళ్లిపోతున్నా. బావ చావుకు కారణమైన వారిని వదలకండి. అలాగే నా చివరి కోరిక కూడా తీర్చండి. బావ చనిపోయాక చివరిసారి కూడా చూడలేదు. అందుకే నన్నూ బావని దహనం చేసిన చోటే కాల్చండి. ఇదే నా చివరికోరిక. ప్లీజ్ నాన్న. మేము బతికి ఉన్నప్పుడు మేము ఎలాగూ కలిసి ఉండలేకపోయాం. కనీసం చనిపోయాక అయినా కలిసి ఉంటాం. ఎవరికో భయపడి నేను చనిపోవడం లేదు. నాకు బావ ప్రేమ కావాలి. బావ లేకుండా ఉండలేను. నాకు నువ్వు, అమ్మ ఎంతో.. బావ కూడా అంతే నాన్న. తమ్ముడిని బాగా చూసుకో. అమ్మ జాగ్రత్త’ అని శిరీష సూసైడ్ నోట్‌లో రాసింది.
కుమార్తె రాసిన సూసైడ్ నోట్ చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ విషయం తెలిసి ఉంటే కూతురిని కంటికి రెప్పలా కాపాడుకునే వారం కదా అంటూ వారు విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.
Tags: Basara triple IT student commits suicide- suicide note that brings tears