సోమల లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు బేష్

– సీఎం పరిపాలనపై పరిశీలన బృందం ప్రశంసలు

Date:16/01/2021

సోమల ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై కేంద్ర బృందం శనివారం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చిన ప్రతాప్ రావు జాదవ్ తో పాటు ఐదు మంది ఎంపీలు మరియు చిత్తూరు రాజంపేట ఎంపీలు ఎన్ రెడ్డెప్ప పీవీ మిధున్ రెడ్డి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో కలసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పులిచెర్ల మండలం లో వాటర్ షెడ్ పథకం లో నిర్మించిన చెక్ డ్యాంలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో నిర్మించిన నీటి కుంటలు, నూతన గ్రామ సచివాలయం భవనాలు పరిశీలించారు. అనంతరం కల్లూరులో మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. బృందం సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం ప్రశంసనీయంగా ఉందని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. పథకాల అమలు పై ప్రశంసలు కురిపించారు. పలు చోట్ల అధికారులు ఏర్పాటు చేసిన పోటోలను పరిశీలించారు. ఈ సందర్భంగా టీం సభ్యులను మంత్రి, జిల్లా ఆధికారులు శాలువాలు కప్పి, వెంకటేశ్వర స్వామి ప్రతిమలను అందజేసి, పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దిరెడ్డి, అశోక్ కుమార్, సుధీర్ రెడ్డి, విశ్వనాథం, ఎంపీపీలు చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, సురేంద్ర రెడ్డి, జడ్పిటిసిలు రెడ్డీశ్వర రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, మురళీధర్ జిల్లా అధికారులు సీఈవో ప్రభాకర్ రెడ్డి వివిధ శాఖ పీడీలుపాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Bash to implement central government schemes in Somala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *