Natyam ad

పుంగనూరులో సచివాలయాల ద్వారా మౌళిక వసతులు-మున్సిపల్‌ చైర్మన అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

సచివాలయాలకు కేటాయించిన రూ.20 లక్షల రూపాయలతో ఆప్రాంత పరిధిలో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు  మున్సిపల్‌ చైర్మన అలీమ్‌బాషా తెలిపారు. శుక్రవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి,  మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌.పేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ బావుట బుక్‌లెట్లను పంపిణీ చేశారు.  చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సచివాలయాల పరిధిలో వచ్చిన సమస్యలను గుర్తించి , మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలువలు, రోడ్లు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు చేపట్టామన్నారు. అలాగే విస్తరణ ప్రాంతాలలో కూడ విద్యుత్‌లైన్లు, పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు. గడగప గడపకు వెళ్లి వ్యక్తి గత సమస్యలను కూడ తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు భారతి, రాఘవేంద్ర, త్యాగరాజు, అమ్ము, అర్షద్‌అలి, కిజర్‌ఖాన్‌, నరసింహులు, రేష్మా, కాళిదాసు, మనోహర్‌, సాజిదా తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: Basic facilities through secretariats in Punganur-Municipal Chairman Aleem Basha

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.