బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి

కౌన్సిలర్ జయశ్రీ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి

జగిత్యాల ముచ్చట్లు:


ఎన్నికల కోడ్ మూలంగా ఆగిన బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని జగిత్యాల మున్సిపల్ 35 వ వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ ను ప్రకటనలో కోరారు. ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ చేయాలని ఆదేశించిన వెంటనే చీరెల పంపిణీ కేవలం రెండు రోజులు మాత్రమే పంపిణీ  చేయగా ఎలక్షన్ కోడ్ మూలంగా పంపిణీ చేయవద్దని కలెక్టర్ గా మీరు ఆదేశించిన వెంటనే పంపిణీ నిలిపి వేయడం జరిగిందన్నారు. దీంతో చాలా పెద్ద మొత్తంలో మహిళలు చీరెలు తీసుకోలేక పోయారని జయశ్రీ వాపోయారు. ఎలక్షన్స్ పూర్తయి కోడ్  తొలిగినందున వెంటనే మున్సిపల్ అదీనంలో ఉన్నా బతుకమ్మ చీరలను వెంటనే పంపణీ చేయవల్సిందిగా జగిత్యాల పట్టణ మహిళల పక్షాన  జయశ్రీ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

 

Tags: Bathukamma sarees should be distributed

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *