బీజేపీ నేతపై లాఠీ చార్జీ

Date:12/01/2021

జనగామ  ముచ్చటు:

జనగామ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ముందు బిజెపి పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. కమిషనర్ అధికారపార్టీకి కొమ్ము కస్తూన్నాడని, వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేసాయి.
ఈ నెల 5న బండి సంజయ్ జనగామ పర్యటన సందర్భంగా 4వ తేదీన బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లను సిబ్బంది తొలిగించింది.  మళ్ళీ మంగళవారం నాడు  స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రచురించిన బిజెపినేతలు బ్యానర్ల ను మున్సిపల్ సిబ్బంది తొలిగించడాన్ని నిరసిస్తూ జనగామ బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ, పార్టీ శ్రేణుల నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక సిఐ మల్లేష్ బిజెపి పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మపై లాఠీతోవిరుచుకపడ్డాడు. తరువాత బిజెపి నాయకులను పోలీసు స్టేషన్ కి తరలించారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Baton charge against BJP leader

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *