Natyam ad

పుంగనూరులో ప్రత్యేక ప్రతిభావంతులకు బ్యాటరీ సైకిళ్లు – ఎంపీ మిధున్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రత్యేక ప్రతిభావంతులందరికి రెండునెలల్లో బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్‌లు అందిస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండల కార్యాలయంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో రామనాథరెడ్డి ఆధ్వర్యంలో 27 మందికి ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులతో మాట్లాడారు. ట్రైసైకిళ్ళలో తిరగడం కష్టమని ఎంపీపీ తెలపడంతో ప్రతిభా వంతులందరికి బ్యాటరీ సైకిళ్లను కొనుగోలు చేసి అందిస్తామని ఎంపీ హామి ఇచ్చారు. ఈ మేరకు మండలం , మున్సిపాలిటిలో జాబితాలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, రాష్ట్ర జానదప కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైస్‌ ఎంపీపీ ఈశ్వరమ్మ, కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు చెంగారెడ్డి, మంగళం రాజారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Battery bicycles for special talents in Punganur – MP Midhun Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.